Chiru-RGV: చిరంజీవితో సినిమా చేయకపోవడంపై వర్మ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. నాకు ఆ సత్తా లేదు

Published : Jun 18, 2026, 04:20 PM IST

మెగాస్టార్‌ చిరంజీవితో రామ్‌ గోపాల్‌ వర్మ గతంలో ఓ మూవీ చేయాలని ప్లాన్‌ చేశారు. షూటింగ్‌ స్టార్ట్ అయి ఆగిపోయింది. అయితే చిరంజీవితో సినిమా చేయకపోవడంపై వర్మ స్పందించి బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 

PREV
15
తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తోన్న చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు ముప్పైఏళ్లుగా తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆ తర్వాత తరం హీరోలు ఎంత మంది వచ్చినా, ఆయన స్థానాన్ని ఎవరూ తాకలేకపోయారని చెప్పొచ్చు. చిరంజీవి ఇప్పటికీ తన సీనియర్‌ హీరోల్లో తానే టాప్‌ అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల `మన శంకర వర ప్రసాద్‌ గారు` చిత్రంతో మరోసారి తన సత్తాని చాటారు. ఈ చిత్రం రీజినల్‌ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. చిరంజీవి రేంజ్‌కిది నిదర్శనంగా చెప్పొచ్చు.

25
రామ్‌ గోపాల్‌ వర్మతో ఆగిపోయిన చిరంజీవి మూవీ

ఇదిలా ఉంటే చిరంజీవి ఇప్పటి వరకు 158 సినిమాలు చేశారు. మధ్యలో మరెన్నో చిత్రాలు ఆగిపోయాయి. సింగీతం శ్రీనివాస్‌రావుతో ఓ మూవీ అనుకొని ఆపేశారు. అలానే సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మతోనూ ఓ మూవీ షూటింగ్‌ చేసి ఆపేశారు. అయితే చిరంజీవితో సినిమా చేయకపోవడంతో ఆ మధ్య రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. అసలు కారణం వెల్లడించాడు. మెగాస్టార్‌తో మూవీ చేసే సత్తా తనకు లేదని వెల్లడించాడు. ఆయన ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేయలేనని తెలిపాడు.

35
చిరంజీవి ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసే సత్తా తన వద్ద లేదంటూ వర్మ స్టేట్‌మెంట్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఇమేజ్‌, ఆయన అభిమానుల అంచనాలకు తగినట్టుగా సినిమా తీసే కెపాసిటీ తన వద్ద లేదని రామ్‌ గోపాల్‌ వర్మ స్పష్టం చేశాడు. తన మార్క్ సెన్సిబులిటీస్‌ వేరుగా ఉండటం వల్ల, మెగాస్టార్‌ స్థాయి మాస్‌ సినిమాను మలచడం తనకు సాధ్యం కాదని చెప్పాడు. ఆయన రేంజ్‌ మూవీ చేయడం తన వల్ల కాదని బహిరంగంగానే ఒప్పుకున్నాడు వర్మ. ఆయనతో సినిమా ఆగిపోవడానికి కారణం కూడా అదే అని ఆయన వెల్లడించారు.

45
చిరంజీవితో సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

1996 టైమ్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్నాడు. ఆ సమయంలో చిరంజీవితో ఆగస్ట్ 11న సినిమాని ప్రారంభించారు.ఇందులో ఊర్మిళను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. మణిశర్మ సంగీత దర్శకుడిగా ఖరారు అయ్యారు. కర్నాటకలో తొలి షెడ్యూల్‌ని షూట్‌ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. కొన్ని సన్నివేశాలు, ఒక పాటని చిత్రీకరించారు. రెండో షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలనుకునే సమయంలోనే జైల్‌ నుంచి సంజయ్‌ దత్‌ విడుదలయ్యాడు. ఆయనతో వర్మ `దౌడ్‌` అనే సినిమాని తీస్తున్నాడు. అది మధ్యలోనే ఆగిపోయింది. సంజయ్‌ దత్‌ జైల్‌ నుంచి రిలీజ్‌ కావడంతో ఆ మూవీ కంప్లీట్‌ చేయాలని వర్మపై ఒత్తిడి పెరిగింది. దీంతో చిరంజీవిని రిక్వెస్ట్ చేసుకొని ఆ మూవీ షూటింగ్‌కి వెళ్లిపోయాడు వర్మ. ఆయన మళ్లీ రావడానికి చాలా టైమ్‌ పట్టింది. ఈ లోపు చిరంజీవికి వరుసగా సినిమాలు వచ్చాయి. డేట్స్ కుదరలేదు. దీంతో వర్మతో సినిమా అంతటితోనే ఆగిపోయింది. అలా వర్మ, చిరంజీవి కాంబినేషన్‌లో మూవీ ఆగిపోయింది.

55
బాబీతో సినిమాతో బిజీగా ఉన్నా చిరంజీవి

ఇటీవల `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీతో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్న చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. త్వరలోనే మరో షెడ్యూల్‌కి రెడీ అవుతున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. సినిమాలో కొంత మాఫియా ఎలిమెంట్లు కూడా ఉంటాయని టాక్‌. దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories