ఆ పోస్ట్ తో రేణూ దేశాయ్ రెండో పెళ్లి తెరపైకి, టెన్షన్ లో పవన్ ఫ్యాన్స్!

First Published Apr 17, 2021, 8:10 AM IST

పవన్  కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తిరేపుతున్నాయి. ఆమె ఆంతర్యం ఏమిటో అర్థం కాక, పవన్ ఫ్యాన్స్ తలగోక్కుంటున్నారు. 
 

పవన్ కళ్యాణ్ జీవితంలో రేణూ దేశాయ్ ఎపిసోడ్ అనేక సంచలనాలకు కారణం అయ్యింది. బద్రి మూవీ కోసం కలిసి నటించిన ఈ జంట, మనసులు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రేమ కోసం సినిమాలు వదిలేసి కెరీర్ త్యాగం చేసింది రేణూ.
undefined
12ఏళ్ల సహచర్యం తరువాత 2012లో రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడిపోవడానికి కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇద్దరిలో ఎవరు కూడా విడాకుల వెనుక కారణం ఏమిటో చెప్పలేదు.
undefined
పవన్ నుండి విడిపోయిన రేణూ దేశాయ్ పూణే వెళ్లిపోయారు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలను పెంచి పెద్ద చేశారు. అయితే పవన్ తనకు అన్యాయం చేసినట్లు అనేక ఇంటర్వ్యూలలో రేణూ దేశాయ్ ఆరోపణలు చేశారు.
undefined
కాగా కొన్నేళ్ల క్రితం రేణూ దేశాయ్ రెండో పెళ్ళికి సిద్ధం అయ్యారు. ఓ వ్యక్తితో ఆమె ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే రేణూ దేశాయ్ రెండో పెళ్లిని పవన్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. రేణూ రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని, గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
undefined
ఫ్యాన్స్ బెదిరింపులకు రేణూ దేశాయ్ స్పందించారు. తన నిర్ణయాలను వ్యతిరేకించడానికి మీరు ఎవరని, ఆమె కూడా గట్టిగా సమాధానం చెప్పారు. కారణం ఏమిటో తెలియదు కానీ, రేణూ రెండో పెళ్లి నిశ్చితార్ధం తోనే ఆగిపోయింది. ఆమె పెళ్లి చేసుకోలేదు.
undefined
అయితే మరలా ఇన్నేళ్ల తరువాత రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఆమె తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. మరో ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో నాకు ఈ ప్రపంచంతో పని లేదని కామెంట్ చేశారు.
undefined
రేణూ దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ చూసిన కొందరు, ఆమె మరలా రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటుంది ఏమో అని పవన్ ఫ్యాన్స్  టెన్షన్ పడుతున్నారు.
undefined
మరి రేణూ దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక నటిగా రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె సినిమాలు, సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
undefined
రేణూ దేశాయ్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. అలాగే దర్శకురాలిగా కొన్ని సినిమాలు చేయనున్నట్లు రేణూ దేశాయ్ చెప్పడం విశేషం.
undefined
click me!