వెధవల్లారా, ఆయన అకీరా తండ్రి.. అమ్ముడు పోయాను అన్నప్పుడు కూడా బాధలేదు కానీ, ఇచ్చి పడేసిన రేణు దేశాయ్

First Published | Oct 29, 2023, 3:55 PM IST

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ పెరుగుతోంది. 

అయితే రేణుదేశాయ్ ఇటీవల ఎక్కువగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనితో మరోసారి పవన్ కళ్యాణ్, రేణు విడాకుల గురించి చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితం కారణంగా పొలిటికల్ గా కూడా విమర్శలు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. 


తాజాగా దీనిపై రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తోంది. పవన్ తన విషయంలో తప్పు చేసినప్పటికీ పొలిటికల్ గా ప్రజలకు మంచి చేసే ఉద్దేశం తనకి ఉందని చెబుతోంది. ఈ క్రమంలో పవన్ ని వ్యతిరేకించే వారు రేణు దేశాయ్ ట్రోల్ చేస్తున్నారు. 

తాను ఏం మాట్లాడినా అమ్ముడుపోయాను అంటున్నారు. ఇంతకీ నేను ఎవరికీ అమ్ముడుపోయానో ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నానో అర్థం కావడం లేదు. అయితే నేను అమ్ముడు పోయాను అన్నప్పుడు కూడా బాధపడలేదు. కానీ అకిరా విషయంలో ఒక మాట అంటూ విమర్శించినప్పుడు నా మైండ్ పోయింది. 

అది ఏంటంటే.. నేను కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తోంది అకీరా హీరో గా లాంచ్ చేయడం కోసం అట. వెధవల్లారా.. ఆయన అకీరా తండ్రి. అకీరాని లాంచ్ చేయడానికి అతడి తండ్రినే నేను మెప్పించడానికి ట్రై చేస్తున్నానా ? అంటూ రేణు దేశాయ్ విరుచుకుపడింది. 

ఇంకొక విషయం కూడా చెబుతాను అకిరా లైఫ్ లో సెటిల్ కావడానికి నా అవసరం, కళ్యాణ్ గారి అవసరం కూడా లేదు. సొంతంగా సెటిల్ కాగలడు అని పేర్కొంది. ఇక ఈ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ తన ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా అనేక అంశాల గురించి మాట్లాడింది. 

Latest Videos

click me!