ఈ సినిమా 6వ తేదీన విడుదల కానుంది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్, ఆరవ్, అర్జున్, త్రిష, రెజీనా నటించారు. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ గురించి రెజీనా మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కోసం రెజీనా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
అందులో శివకార్తికేయన్ గురించి అడిగారు. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. నేను, సివ కార్తికేయన్ కెడి బిల్లా కిల్లాడి రంగా సినిమాలో నటించాం. ఈ సినిమా విడుదలై 12 ఏళ్లు అయ్యింది. అయితే, శివకార్తికేయన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పూ లేదు.