నయనతార విఘ్నేష్ రిసెప్షన్ కాన్సల్ కు కారణం అదేనా..? శభాష్ అంటున్న అభిమానులు

First Published | Jun 18, 2022, 9:54 PM IST

నయనతార పెళ్ళికి స్టార్స్ కొద్దిమందిని తప్పించి ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరినీ పిలవలేదు. చెన్నైలో భారీ స్థాయిలో రిసెప్షన్ పెడతాం అన్న జంట.. పెళ్ళై పదిరోజులు అవుతున్నా ఎందుకు స్పందించడంలేదు. రిసెప్ష్ ఎందుకు కాన్సల్ అయ్యింది..? విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ శభాస్ అని ఈ జంటను ఎందుకు మెచ్చుకుంటున్నారు..? 

రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటి అయ్యారు నయన్ విఘ్నేష్ శివన్.  మహాబలిపురంలోని స్టార్ హోటల్ లో కన్నుల పండుగగా వీరి పెళ్ళి ముగిసినప్పటికీ వారి పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాప్ గానే ఉన్నాయి.

వీరి పెళ్లిని తిరుపతిలో చేసుకోవాలని మొదట నిర్ణయింకున్నారు కానీ ఏం జరిగిందో ఏమో చివరి క్షణంలో క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్ళికి సంబంధించి కొన్ని ఫోటోలు తప్పించి ఇతర వీడియోలు, బయటకు రాలేదు. త్వరలోనే వీరి పెళ్ళిని  నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ వీడియోను తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేశారు. 


Nayanthara-Vignesh Shivan wedding-Shah Rukh Khan trolled for attending WikkiNayan's big day

నయనతార , విఘ్నేష్ ల పెళ్ళికి రజనీకాంత్, షారుఖ్ లాంటి కొంత మంద ప్రముఖులు మాత్రమే వచ్చారు. నయన్ కు అటుతమిళ,తెలుగు,మలయాళంలో స్టార్స్ , ఫ్యాన్స్ ఉన్నా.. కొంత మందిని మాత్రమే పెళ్లికి పిలిచారు. ఇక అందరికి చెన్నైలో భారీ రిసెప్షన్ పెట్టి.. ఆహ్వానించాలి అని అనుకున్నారు. కాని పెళ్ళి జరిగి 10 రోజులు అవుతున్న రిసెప్షన్ జరగలేదు. అది కాన్సిల్ అయినట్టు సమాచారం. 

Nayanthara Vignesh Shivan

అయితే వివాహానంతరం చెన్నైలో రిసెప్షన్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నిర్వహించలేదు అని పలువురు విమర్శిస్తున్నారు. రిసెప్షన్ కనుక చెన్నైలో నిర్వహిస్తే కోలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యే వారు. కానీ ఇప్పుడేమో రిసెప్షన్ క్యాన్సిల్ అంటూ సమాచారం అందుతోంది.

అయితే దీనికి ఓ రీజన్ ఉంది అని సోషల్ మీడియాతో పాటు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రెసెప్షన్ కోసం ఖర్చు పెట్టాలి అనుకున్న మొత్తాన్ని తమిళనాడులోని అన్ని అనాధ ఆశ్రమాలకు పంచాలని నయన్‌ మరియు విఘ్నేష్ లు భావించారట. దీంతో ఒక రోజు పూర్తిగా అన్ని అనాధ ఆశ్రమాలకు ఆహారం పెట్టేంత మొత్తాన్ని నయన్ మరియు విఘ్నేష్ శివన్‌ లు ఇచ్చారని సమాచారం.

Image: Vignesh ShivanInstagram

అనుకున్నట్టుగా రిసెప్షన్ జరిగితే.. కొద్దిమంది మాత్రమే గుర్తుంచునే వారు. కాని ఇప్పుడు నయన్‌ మరియు విఘ్నేష్ చేసిన మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. మీపై ఉన్న గౌరవం మరింత పెరిగింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

పెళ్లి తరువాత  వెంటనే తిరుపతి వెళ్లిన నయన్ దంపతులు ఇప్పుడు కేరళలోని నయన్‌ స్వస్థలం కు కూడా వెళ్లి తన తల్లి వద్ద ఆశీస్సులు తీసుకొని, అక్కడ ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు, ప్రముఖ ప్రదేశాలు సందర్శిస్తున్నారని సమాచారం. 

ఇక అన్ని ప్రాంతాలు తిరిగిన తరువాత వీరిద్దరు హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. కొన్ని రోజులు ఇద్దరు ఏకాంతంగా విదేశాలకు వెళ్తారట. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఇద్దరూ సినిమాలతో బిజీ కాబోతున్నట్టు సమాచారం. 

Latest Videos

click me!