TNR Twitter Review: టైగర్ నాగేశ్వరరావు ట్విట్టర్ రివ్యూ, రవితేజ అనుకున్నది సాధించాడు.. కాని...?

First Published | Oct 20, 2023, 6:52 AM IST

మాస్ మహారాజా రవితేజ మొదటి సారి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు వెళ్ళిన సినిమా టైగర్ నాగేశ్వార రావు. ఈమూవీ ఈరోజు ( అక్టోబర్ 20) ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఈలోపు ప్రీమియర్స్ సందడి చేయగా.. అది చూసిన ఫారెన్ ఆడియన్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను ట్వీట్టర్ లో వెల్లడిస్తున్నారు. మరి రవితేజ టైగర్ నాగేశ్వర్ రావుగా అలరించాడా.. చూద్దాం..? 
 

రవితేజ టైటిల్ రోల్ పోషించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా రియల్ లైఫ్ స్టోరీ. ఒకప్పుడు దేశాన్ని గడగడలాడించిన  స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ ఆధారంగా ఈసినిమాను తెరకక్కించారు. ఇందులో కొంత యాడెడ్ కంటెంట్ కూడా ఉంది. ఇక ఈమూవీలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించగా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఈసినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె హేమలతా లవణం పాత్రలోకనిపించారు. వంశీ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
 

టైగర్ నాగేశ్వారరావు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. ఈమూవీ చూసిన ఆడియన్స్ కాస్త పాజిటీవుగానే స్పందిస్తున్నారు.అయితే అందులో నెగెటీవ్ కామెంట్స్ కూడా లేకపోలేదు. మూవీలో జరిగిన లోటు పాట్ల గురించి  కూడా కామెంట్ చేస్తున్నారు ట్విట్టర్ జనాలు.  అందులో  ముఖ్యంగా చెప్పుకోవల్సింది రవితేజ్ పెర్ఫామెన్స్.. ఈ విషయంలో తిరుగులేదంటున్నారు ప్రేక్షకులు. 
 

Latest Videos


మాస్ మహారాజా తప పెర్పామెన్స్ తో అదరగొట్టేశాడు. మళ్ళీ  కిక్ లాంటి.. కిక్కిచ్చే పెర్ఫామెన్స్ చూపించాడు అంటున్నారు ఆడియన్స్.  ఇక ఈమూవీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది.. అనే అభిప్రాయం వెల్లడవుతుంది. రవితేజతో పాటు.. నుపుర్ సనన్ పెర్ఫామెన్స్ కూడా బాగుందన్న కామెంట్స్ వినిపించాయి. ఇక రేణు దేశాయ్ యాక్టింగ్ విషయంలో.. ఇన్నేళ్ళ గ్యాప్ వచ్చినా.. ఆమెనటనలో ఏమాత్రం తేడా రాలేదంటున్నారు. 

అంతే కాదు ఈసినిమాకు ఫైట్ సీక్వెన్స్ లు బాగా వర్కౌట్ అయ్యాయి అనే కామెంట్స్ బాగా కనిపించాయి. పాన్ ఇండియాను సంతృప్తి పరచగలిగే యాక్షన్ సీక్వెన్స్ లు ఈసినిమాలో ఉన్నాయంటున్నారు. అంతే కాదు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో  కూడా సంతృప్తి వ్యాక్తం చేస్తున్నారు.

ఇక ఈమూవీకి సబంధించి నెగెటీవ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. మూవీలో మైనస పాయింట్స్ ను కూడా ట్విట్టర్ లో చెప్పేస్తున్నారు ఆడియన్స్. మరీ ముఖ్యంగా ఈసినిమాలో పాటలు పెద్ద మైనస్ గా మారాయంటున్నారు.  ఫస్ట్  హాఫ్ మూవీ బాగున్నా.. సెకండ్ హాఫ్ విషయంలో కాస్త తడబడ్డారంటూ కామెంట్ చేస్తున్నారు కొంత మంది ప్రేక్షకులు. సాగదీత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

రన్ టైమ్ కూడా ఆడియన్స్ కు బోరు కొట్టించే విధంగా ఉన్నట్టు సమాచారం. ఇక టైగర్ నాగేశ్వారావు... ప్రీమియర్స్ ద్వారా పర్వాలేదు అనిపించాడు.. ఇక ఓవర్ ఆల్ గా ఈరోజు థియేటర్లలోకి రాబోతున్నాడు. మరి వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో..? అనకున్న కలెక్షన్స్ సాధిస్తాడా..? చూడాలి. 
 

click me!