Eagle Review: ఈగల్ ప్రీమియర్ టాక్: రవితేజ మూవీ హిట్టా? ఫట్టా? ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

First Published | Feb 9, 2024, 6:30 AM IST

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈగల్ నేడు విడుదలైంది. ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ ఏమిటో చూద్దాం... 
 

Eagle Movie Review

హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్యకాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ స్థాయి చిత్రం రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు అనిపించింది. వరుస చిత్రాలు చేస్తున్నా పరాజయాల శాతమే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి ఛాన్స్ ఇచ్చాడు. 

Eagle Movie Review

ఈగల్ ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. మధుబాల, వినయ్ రాయ్, నవదీప్ కీలక రోల్స్ చేశారు. ఈగల్ మూవీపై ట్రైలర్ అంచనాలు పెంచేసింది. అదే సమయంలో రవితేజ మూవీ చూసి పూర్తిగా సంతృప్తి చెందినట్లు కామెంట్ చేశాడు. ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే... హైప్ పెంచేలా లాస్ట్ 40 మినిట్స్ అదిరిపోతుందని హామీ ఇచ్చాడు. 
 


Eagle Movie Review

కాగా ఈగల్ సినిమా చూసిన ఆడియన్స్  నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఈగల్ పూర్తిగా కెజిఎఫ్ స్ఫూర్తితో తెరకెక్కించిన చిత్రం అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో హీరో గురించి పలు పాత్రలు చెప్పే ఎలివేషన్ సీన్స్ తో సాగుతుంది. జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరన్ హీరో సహదేవ్ వర్మ గురించి ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంది. 

Eagle Movie Review

ప్రతి పాత్ర సహదేవ్ వర్మను ఆకాశానికి ఎత్తుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో రవితేజ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే అంటున్నారు. కథలో కొంత కొత్తదనం ఉన్నప్పటికీ కథనం ఆసక్తికరంగా సాగలేదనే మాట వినిపిస్తోంది. 

Eagle Movie Review

రవితేజ లుక్, క్యారెక్టరైజేషన్, యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. రవితేజ ఎనర్జీ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యాన్స్ కి ప్ ఫీస్ట్. అనుపమ పరమేశ్వరన్ జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది. కావ్య థాపర్ మెప్పించింది. అయితే వినయ్ రాయ్, మధుబాల వంటి నటులను పూర్తి స్థాయిలో వాడుకోలేదంటున్నారు. 

Eagle Movie Review

సాంకేతికంగా మూవీ రిచ్ గా ఉంటుంది. మ్యూజిక్ నిరాశపరిచింది. బీజీఎం పర్లేదు. సాంగ్స్ మాత్రం ఆకట్టుకోవు. దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మాస్ మహరాజ్ రవితేజ ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. 
 

Eagle Movie Review


మొత్తంగా ఈగల్ మాస్ యాక్షన్ డ్రామా. కెజిఎఫ్ స్పూర్తితో దర్శకుడు కార్తీక్ ఈగల్ తెరకెక్కించాడు. యాక్షన్ ఎపిసోడ్స్, నిర్మాణ విలువలు, యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయి. అయితే కథనం మెప్పించదు. రవితేజ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే అంశాలు సినిమాలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!