Dhamaka Review: 'ధమాకా' ట్విట్టర్ రివ్యూ.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు, పాత రవితేజ మళ్ళీ వచ్చేశాడు

First Published Dec 23, 2022, 7:07 AM IST

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా సూపర్బ్ గా వర్కౌట్ అయింది. దీనితో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలయింది. 

రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొట్టాయి. దీనితో ఈసారి రవితేజ తనకి కొట్టిన పిండి అయిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని ఎంచుకున్నారు. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఆసక్తిరమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

ఈ చిత్రం ప్రారంభం కావడమే షాకింగ్ ట్విస్ట్ తో మొదలవుతుంది. రవితేజ ఈ చిత్ర భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకుని మోశాడట. రవితేజ కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ లో అతడి ఎనర్జీ చూస్తుంటే ట్విట్టర్ లో ఫ్యాన్స్.. వింటేజ్ రవితేజ మళ్ళి వచ్చేశాడు అంటూ పొంగిపోతున్నారు. 

ధమాకా మూవీ స్టోరీ రొటీన్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా అనిపిస్తుంది. కానీ రవితేజ తన ఎనర్జీతో ఎంటర్టైనింగ్ గా మార్చేశాడు. ఇంటర్వెల్ సన్నివేశం ఆకట్టుకుంటుంది. కామెడీ, పాటలు , ఇంటర్వెల్ బ్లాక్ ఇలా కొన్ని అంశాలు ఫస్ట్ హాఫ్ ని ఆసక్తికరంగా మార్చాయి అని ఓ నెటిజన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

మిరపకాయ్ రిషి కాదు.. బలుపు శంకర్ కాదు.. ఏకంగా వెంకీలో వెంకటేశ్వర్లు దిగేశాడు. సింగిల్ స్క్రీన్స్ లో పూనకాలు గ్యారెంటీ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరికొందరు ధమాకా డబుల్ బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రొటీన్ స్టోరీ అనే అంశాన్ని పక్కన పెడితే దర్శకుడు త్రినాధ్ రావు.. మాస్, ఎంటర్టైన్మెంట్ కి అవసరం ఐన అన్ని అంశాలని టిక్ చేశారు. 

రావు రమేష్ కామెడీ అదిరిపోయింది. బిజియం కూడా సాలిడ్ గా ఉంది. వెంకీ, దుబాయ్ శ్రీను, కిక్ కలిపి కొడితే ధమాకా. రవితేజ పెర్ఫామెన్స్ పైసా వసూల్ అనిపించేలా ఉంది. పాత రవితేజని మళ్ళీ చూసి ఎంజాయ్ చేయండి. మాకు కావాల్సింది ఇదే రావన్నా అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా చాలా మంది ఈ చిత్రంలో వింటేజ్ రవితేజని చూస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఎక్కడా తగ్గలేదు. ఆమె పెర్ఫామెన్స్ కూడా మెప్పించే విధంగా ఉంది. ముఖ్యంగా సాంగ్స్ లో శ్రీలీల ఎనర్జీ నెక్స్ట్ లెవల్. ధమాకా చిత్రం డబుల్ ఇంపాక్ట్ విధంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ధమాకా అవుట్ డేటెడ్ మూవీ. చాలా రొటీన్. ఈ చిత్రంలో వినోదాన్ని అందించే అంశాలు చాలా తక్కువ. ఎంగేజింగ్ గా ఏమీ లేదు. మ్యూజిక్ కాస్త బావుంది. పదేళ్ల క్రితం వచ్చిన పాత చిత్రాన్ని చూస్తున్నట్లు చిరాకు పుట్టించారు అంటూ కొందరు నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. 

click me!