రవితేజ ‘క్రాక్‌’ రివ్యూ

First Published Jan 10, 2021, 7:26 AM IST

రవితేజకు పోలీస్ డ్రస్ బాగానే అచ్చొచ్చింది.  పోలీస్ కథ‌లు చేసిన ప్ర‌తీసారీ హిట్టు ద‌క్కించుకుంటూనే ఉన్నాడు. అప్పట్లో రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ మీసం మెలేసిన మాస్ రాజా..ఆ తర్వాత బలుపులోనూ మరోసారి పోలీస్ గా దుమ్ము రేపారు. ఇదిగో ఇప్పుడు క్రాక్ సినిమాతో  పోతరాజు వీర శంకర్‌గా పోలీస్ అవతారం ఎత్తాడు.వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ర‌వితేజ ఈ పోలీస్ డ్రస్ తో ఒడ్డున పడదాముకున్నాడు‌. ఈ సినిమాతో హిట్టు ప‌డితే… త‌న కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంద‌న్న ఆశగా ఉన్నాడు. దానికి తోడు `క్రాక్‌` ట్రైలర్ చూస్తూంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ తో తెర‌కెక్కిన సినిమా అనిపించింది. పాట‌లూ మాస్ కి బాగా ఎక్కాయి. అన్నిటికన్నా ముందు కరోనా తర్వాత రిలీజ్ అవుతున్న మాస్ సినిమా ఇదే. సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినీ పందెం కోడి..ఏ మేరకు అభిమానులను అలరించింది. హిట్ టాక్ తో దూసుకుపోతుందా. రవితేజం మళ్లీ గత వైభవం తెచ్చుకోగలుగుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి: 'వాడో పెద్ద క్రాక్ గాడు' అనే వాక్యానికి ఫెరఫెక్ట్ నిర్వచనం గా వీరశంకర్ పోతురాజు(రవితేజ) అనే సిఐ బిహేవ్ చేస్తూంటాడు. తన పరిధిలో ఉన్న ఏరియాలో ఎవడు ఏ తప్పు చేసినా వాడి తాట తీయందే నిద్రపోడు. అలాగే ఈ సీఐ గారికి ఓ వీక్నెస్. ఎవడైనా ‘బ్యాక్ గ్రౌండ్’ అనే మాట వాడాడా కంట్రోల్ తప్పుతాడు, పిచ్చ ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎదుటి వాడు ఏ స్దాయి వాడైనా వాడి గూబ పగలకొట్టందే నిద్రపోడు. ఈ స్దాయిలో చెలరేగిపోయి క్రిమినల్స్ గుండెల్లో గన్ పెట్టుకుని నిద్రపోయే శంకర్ ని... కడపకి పంపుతారు. అదే టైమ్ లో కడపలో ఓ చిన్న క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యన కొండారెడ్డి(రవి శంకర్)కి అక్కడ ఎస్.పి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడికి డ్యూటీ మీద వచ్చేవాడు పెద్ద క్రాక్..జాగ్రత్త అంటాడు. అబ్బే నేను ఇలాంటి వాళ్లను చాలా మందిని చూసాను అంటాడు కొండా రెడ్డి.
undefined
నేను చెప్పేది మామూలు వాడి గురించి కాదు.. ..నీకు నమ్మకం కలగాలి, వాడి గురించి పూర్తిగా తెలియాలంటే రాజమండ్రి జైల్లో ఒకడున్నాడు వెళ్లి కలవు అని చెప్తాడు. దాంతో కొండారెడ్డి పనిగట్టుకుని .. వెళ్లి జైల్లో ఉన్న కటారి కృష్ణ (సముద్ర ఖని)ని కలుస్తాడు. అక్కడ కటారి కృష్ణ తన జీవితంలోని ఓ చీకటి అద్యాయం ఓపెన్ చేస్తాడు. చక్కగా చీకటి సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజులా ఏలుతూ...ఒంగోలుకి కింగ్ మేకర్ లా బ్రతికిన తన జీవితంలోకి శంకర్ ఎలా ప్రవేశించాడు..తర్వాత తన పరిస్దితి ఇలా జైల్లో గడపాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చిందో చెప్తాడు.
undefined
ఆ విషయాలు ఏమిటి..అసలు వీర శంకర్ కి – కటారి కృష్ణకి మధ్య ఏం జరిగింది? ఏ విషయంలో కటారి కృష్ణ వీర శంకర్ కి దొరికిపోయాడు. చివరకు కటారి కృష్ణ తనను జైల్లో పెట్టిన శంకర్ పై పగ తీర్చుకున్నాడా? కటారి కథ విన్నాక కొండారెడ్డి ..వీరశంకర్ కు ఎదురు వెళ్లాడా? కథలో కళ్యాణి (శృతిహాసన్), జయమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలి అంటే క్రాక్ చూడాల్సిందే..
undefined
ఎలా ఉంది?: సినిమా స్టోరీలైనా, పుస్తకాల్లోని కథలైనా..వెబ్ సీరీస్ ఎపిసోడ్స్ అయినా గాల్లోంచి పుట్టవు. మన చుట్టూ ఉన్న సమాజంతో పాటు జరిగిన, జరుగుతున్న సంఘటనలు, వ్యక్తుల నుంచే ఉద్భవిస్తాయి అని చాలా మంది నమ్ముతారు. ప్రచారం కూడా జరుగుతూంటుంది. ఈ సినిమాకు వాస్తవ జీవిత సంఘటనలు ఆధారంగా చేసుకున్న కథతో తీసిన సినిమా అని చెప్పారు. ఆ వాస్తవిక సంఘటనలు మనకు తెలియదు కాబట్టి నిజమా కాదా అనేది డిసైడ్ చేసి చెప్పలేం. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలం చాలా సీన్స్ మాత్రం చాలా సినిమాల్లో చూసినవే.
undefined
అయితే డైరక్టర్ వాటికి కొత్త గ్లామర్ అద్దారు..సరికొత్త ఎలివేషన్స్ ఇచ్చారు. దాంతో చూసిన సీన్ అయినా భలే ఉందే అనిపించేలా చేసాడు. తెలిసిన కథనే తెలివైన స్క్రీన్ ప్లే లో ఇరికించి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో కొత్త తరహా ఆబ్జెక్ట్స్ తీసుకుని కథని నడిపించాడు. 'జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుపై ఉండాల్సిన కాయ.. గోడకి ఉండాల్సిన మేకు.. ఈ మూడు.. ముగ్గురు తోపుల్ని తొక్కి తాటతీససాయి' అనే పాయింట్ చుట్టూ స్క్రీన్ ప్లే డిజైన్ చేసారు.
undefined
సినిమా ప్రారంభంలోనే కథకు సంభందించిన హుక్ వేసి, మొదటి 15 నిమిషాల నుండి ఊపందుకునేలా చేసారు. ఇంటర్వెల్ వరకు ఆ స్పీడు కొనసాగుతుంది. అయితే మధ్యమధ్యలో ఫ్యామిలీ ఎపిసోడ్సే పంటిక్రింద రాయిలా ఇబ్బందిపెడుతూంటాయి. ఇక సెకండ్ హాఫ్ రొటీన్ అయ్యిపోయింది.. డల్ అవుతుంది అనిపించే లోపలే మళ్లీ డైరక్టర్ కొన్ని మాస్ ఎలివేషన్స్ బయిటకు తీసి నిలబెట్టాడు.
undefined
ముఖ్యంగా సముద్రఖని క్యారక్టరైజేషన్ అతనితో కథ చెప్పిన విధానం హీరోని బాగా ఎలివేట్ చేసింది. సముద్రఖని గ్యాంగ్..వేటపాలెం బీచ్ సీన్స్ ని బాగా డిజైన్ చేసారు. ఫస్టాఫ్ ..ప్యామిలీ డ్రామాతో మెల్లిగా మొదలైనట్లు అనిపించింది. మొదటగా వచ్చే సలీమ్ భక్తాల్ ఎపిసోడ్(టెర్రరిస్ట్) తో మెల్లిగా యాక్షన్ లోకి వచ్చి..సముద్రఖని ఎపిసోడ్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇంట్రవెల్ దగ్గర వచ్చే జాతర ఫైట్ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.
undefined
చాలా వరకూ మనకు ఊహకు అందుతూండే సీన్స్ అయినా అవి నడిపిన విధానం ఎంగేజింగ్ గా ఉండటంతో నడిచిపోతుంది. అలాగే పోలీసులకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎంతో మెరుగ్గా ఉంటాయి. కానీ సినిమాల్లో వాటిని అప్లయ్ చేయరు. కానీ డైరక్టర్ ఆ విషయంలో కేర్ తీసుకుని, రవితేజ పాత్రలో వాటిని ఇంక్లూడ్ చేయటంతో, క్యారక్టరైజేషన్ లో సహజత్వం కొంత వచ్చింది. క్రియేటివ్ వర్క్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్.
undefined
సెంకడాఫ్ తెలుగు,తమిళ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి బాగా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. కాకపోతే మాస్ ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ తో మేనేజ్ చేసేసారు. ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్ అయితే కేక పెట్టించింది. క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. కటారి కృష్ణ ఎపిసోడ్ సినిమాని నిలబెట్టేసింది. కాకపోతే మొదట్లో ఉన్నంత స్పీడుని చివరి దాకా మెయింటైన్ చేయలేకపోయారు.
undefined
ఇక ఈ సినిమా, త‌మిళ `సేతుప‌తి`కి ఫ్రీమేక్ అనే టాక్ మొదటినుంచీ వినిపిస్తూ వచ్చింది. అయితే ఆ క‌థ‌కూ.. ఈ క్రాక్ క‌థ‌కూ సంభంధం అయితే లేదు. కొద్దిగా విజయ్ ‘పోలీస్’ కు కొంచెం ద‌గ్గ‌ర ల‌క్ష‌ణాలు ఉన్నాయి. కావాలని తీసుకున్నా...అనుకోకుండా వచ్చి చేరినా ఆ సీన్స్, కొన్ని మాస్ ఎలివేషన్స్ ..ఈ చిత్రంలో రవితేజ క్యారక్టర్ లోనూ,కొన్ని సీన్స్ లోనూ స్పష్టంగా కనపడతాయి. అలాగే విలన్ పాత్ర ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. రన్ టైమ్ కూడా ఇంకాస్త తగ్గిస్తే మరింత కిక్ ఇచ్చేది.
undefined
బాగున్నవి సినిమా ఆసాంతం కట్టిపడేసేలా సాగిపోయే ఎమోషన్స్, కొన్ని మాస్ ఎలిమెంట్స్, కొత్తగా కనిపించే ఇంటర్వెల్, క్లైమాక్స్, రవితేజ వన్ మ్యాన్ షో, సముద్ర ఖని యాక్టింగ్ . ఇదివరకు చూసిన కథైనా ఎప్పటికీ కొత్తగా కనిపించే ఎమోషన్స్ కోసం ఓసారి చూడొచ్చు అనే ఫీల్ కలగచేయటం ప్లస్ అయ్యింది.
undefined
బాగోలేనివి ఈ సినిమాకు మైనస్ పాయింట్ అంటే, సినిమాకు హైలైట్ అయిన ఎమోషన్స్ అన్నింటినీ కలిపేందుకు రాసిన కథ చాలా సార్లు చూసిందే కావడం. ఇలాంటిదే పోలీస్ కథకు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను కలిపి గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఎంతవాడు గానీ..’ సినిమాకు, ‘పోలీస్’కు చాలా పోలికలున్నాయి. ఇక శృతిహాసన్, రవితేజ రొమాంటిక్ ట్రాక్ అయితే చాలా బోర్ గా అనిపించింది. అలాగే మొదటే చెప్పుకున్నట్లు కథ ఇప్పటికే చాలాసార్లు చూసింది కావడం, సెకండాఫ్‌లో ఫస్టాఫ్ స్థాయిలో లేకపోవడం,బలవంతంగా ఇరికించినట్లు ఫ్యామిలీ సీన్స్ ఉండటం ప్రతికూలాంశాలు. శృతి హాసన్ క్యారక్టర్ లో వచ్చే ట్విస్ట్ చాలా ఫోర్సెడ్ గా అనిపించి కన్వీన్సింగ్ గా అనిపించదు.
undefined
టెక్నికల్ గా: సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా డైరక్టర్ గోపీచంద్ మలినేని గురించి చెప్పుకోవాలి. ఒక మాస్ హీరో సినిమా నుంచి ఏయే అంశాలైతే ప్రేక్షకులు కోరుకుంటారో ఆయా అంశాలన్నీ చెప్తూనే, ఎమోషన్‌ను ఎక్కడా పడిపోకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. ఆయా ఎమోషన్స్‌ను పండించిన విధానం, ఇంటర్వెల్, క్లైమాక్స్‌లలో దర్శకుడి ప్రతిభ ఏంటో మనకు చెప్తుంది. కథ పరంగా రొటీన్ స్టోరీ లైన్ ను ఎంచుకున్నా, దాన్ని పూర్తిస్థాయి సినిమాగా మలచడంలో, స్క్రీన్ ప్లే డిజైన్ లో రచయితగా సక్సెస్ అయ్యాడు.
undefined
సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు ప్రతిభను మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. భిన్నమైన ఎమోషన్స్‌ను, నేపథ్యాన్ని, కథ రీత్యా వచ్చే మార్పులను సినిమాటోగ్రఫీ పరంగానూ బాగా ఎలివేట్ చేసారు. అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. మాస్ సీన్స్ ను తమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్ళాయి. అలాగే కొన్ని చోట్ల అవసరం లేదు అనిపించే చోట కూడా హై మ్యూజిక్ ఉండడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
undefined
ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకాస్త షార్ప్ చేయచ్చు. ఇక సాయిమాధవ్ బుర్రా ఇన్నాళ్లూ పద్దతిగల సినిమాలకే డైలాగులు రాసారు. ఇప్పుడు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే పంచ్ డైలాగ్స్ రాసి తన పెన్నుకు ఆ పవర్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. మధు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
undefined
నటీనటుల్లో..మొదటగా చెప్పుకోవాల్సిన రవితేజ...గత సినిమాల్లో వయస్సు అయ్యిపోయింది అనిపించుకున్న ఆయన ఈ సారి ఆ కామెంట్ నుంచి తప్పించుకున్నారు. జోష్ తో ఊగిపోయే రవితేజను మళ్లీ చూడచ్చు. సముద్ర ఖని విలన్ గా ఫెరఫెక్ట్. శృతిహాసన్..సోసో. సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి వంటి నటులు పాత్రకు తగిన ఫెరఫార్మెన్స్ చేసారు.
undefined
ఫైనల్ థాట్ మాస్ ప్రేక్షకులకు క్రాక్ – రాక్ ---సూర్య ప్రకాష్ జోశ్యుల Rating:3
undefined
ఎవరెవరు.. : బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌ నటీనటులు: ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు. సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా ఎడిటింగ్: న‌వీన్ నూలి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌ ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి రన్ టైమ్ :2గం|| 34ని|| క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి నిర్మాత‌: బి. మ‌ధు విడుదల తేది: 09012021
undefined
click me!