పాన్ ఇండియాను షేక్ చేస్తోంది రష్మిక మందన్నా. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్.. రెండింటిని మెయింటేన్ చేస్తూ.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంది బ్యూటీ. అన్ని భాషల్లో.. సినిమా ఇండస్ట్రీలో రష్మికకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
వరుసగా పాన్ నిండియా సినిమాలతో ఇండస్ట్రీలను ఊపు ఊపేస్తోంది రష్మిక. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా నటిస్తూ ఉన్నా రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో తిరుగులేని స్టార్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. పుష్ప2 తో ఆమె క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా..ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూనే ఉంటుంది బ్యూటీ. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. ఈక్రమంలో రీసెంట్ గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ను కంగారు పుట్టిస్తోంది. అభిమానులకి టెన్షన్ పెట్టిస్తోంది.
మరో హీరోయిన్ శ్రద్దా దాస్ తో కలిసి ఈ పోస్ట్ పెట్టింది రష్మిక. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మరో హీరోయిన్ శ్రద్ధదాస్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. మీ సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము.. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము “అంటూ చెబుతూ తమ కాళ్లని చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టింది .
అయితే ఈ పోస్ట్ కు అర్ధం ఏంటో తెలియదు కాని.. ఇద్దరు కూడా జర్నీలో ఉన్నాట్టు మాత్రం అర్ధం అవుతోంది. అయితే అదే సమయంలోనే ఏదో ప్రమాదం జరిగింది అంటూ కూడా అర్థం అవుతుంది. ఆశ్చర్యమేంటంటే శ్రద్ధాదాస్ కూడా ఇదే పోస్టును షేర్ చేశారు. దాంతో ప్యాన్స్ కంగారు పడుతున్నారు.
Rashmika Mandanna
ప్రెసెంట్ రష్మిక అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు . అసలు ఏమైంది పూర్తిగా చెప్పండి . ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక ప్రసెంట్ మూడు తెలుగు నాలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ముందుకు వెళ్తుంది.