ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ తరువాత బాలీవుడ్ తో యన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో ఆయన నటించబోయే సినిమాపై దేశమంతా ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇది యన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కావడంతో ఫ్యాస్స్ కూడా ఇంట్రెస్ట్ గా గమనిస్తున్నారు. ఇక ఈ సినిమాను యన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.