మాజీలతో ఫ్రెండ్ షిప్ కొనసాగించడం మంచి లక్షణం కాదు. కానీ నేను ఎవరికీ శత్రువుగా ఉండను అని రష్మిక పేర్కొంది. అలాగే ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ పై మాట్లాడుతూ క్యూట్ కామెంట్స్ చేసింది. చాలా కాలంగా రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ ని రష్మిక, విజయ్ ఖండించలేదు అలాగని అంగీకరించలేదు.