స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ లో రష్మీ హాట్ హాట్ ఫోజులు... చిన్న గౌనులో రెచ్చిపోయిన చిలిపి యాంకర్!

First Published | Jul 29, 2021, 11:20 AM IST

హాట్ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది యాంకర్ రష్మీ గౌతమ్. బుల్లితెరకు దొరికిన ఈ గ్లామరస్ బేబీకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెర ప్రేక్షకుల కలల రాణిగా ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు.

అనసూయ నిష్క్రమించడంతో జబర్దస్త్ లో ఛాన్స్ దక్కించుకున్న రష్మీ, అక్కడ తన స్థానం సుస్థిరం చేసుకుంది. విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని తనకు పోటీ లేదంటూ నిరూపించుకుంది.
జబర్దస్త్ లో రష్మీ గ్లామర్ షో ప్రధాన ఆకర్షణ. పొట్టి బట్టలలో రష్మీ తన అందాలు చూపిస్తూ, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.

హీరోయిన్ కావాలన్న రష్మీ కల జబర్దస్త్ ద్వారానే నెరవేరింది. ఈ షో వలన వచ్చిన పాపులారిటీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు తెచ్చిపెట్టింది.
కెరీర్ బిగినింగ్ లో రష్మీ హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ అనేక చిత్రాలలో చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ అవతారం ఎత్తారు.
జబర్దస్త్ సూపర్ సక్సెస్ కావడంతో రష్మీ దశ తిరిగింది. హీరోయిన్ గా ఆమెకు వరుస ఆఫర్స్ దక్కాయి. అయితే ఆమెకు సరైన బ్రేక్ రాలేదు.  రష్మీ హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు.
దీనితో ఆమెకు వెండితెరపై ఆఫర్స్ తగ్గాయి.  అయితే బుల్లితెరపై ఆమె స్టార్ యాంకర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. జబర్దస్త్ తో పాటు ఢీ వంటి పాప్యులర్ షోలో ఆమె యాంకర్ గా ఉన్నారు.
అలాగే అనేక ప్రత్యేక కార్యక్రమాలలో రష్మీ కనిపిస్తున్నారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న రష్మీ పెళ్లి మాట ఎత్తడం లేదు. దానికి ఇంకా సమయం ఉంది అంటూ విషయం దాటవేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్స్ పిచ్చ పాప్యులర్. తాజాగా స్లీవ్ లెస్ షార్ట్ ఫ్రాక్ లో క్రేజీ పోజులతో రచ్చ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

Latest Videos

click me!