త్వరలో న్యూ ఇయర్ రానున్న సందర్భంగా రష్మీ గౌతమ్ పేరుపై ఒక క్రేజీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు 'రష్మీ పెళ్లి పార్టీ'. రష్మీ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. రష్మీ పెళ్లి అంటే వెంటనే ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ షోలో బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు, బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్లు సందడి చేస్తున్నారు. ఎప్పటిలాగే హైపర్ ఆది, రష్మీ మధ్య సంభాషణ నవ్వులు పూయించే విధంగా ఉంది.