మిహికాతో తన హనీమూన్ ప్లాన్ బయటపెట్టిన రానా..!

First Published | Aug 26, 2020, 8:32 AM IST

దగ్గుబాటి వారసుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా తన హనీమూన్ గురించి చెప్పారు.   
 

టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకోగా వారిలో ఒకరుగా రానా ఉన్నారు. రానా కొద్దినెలల క్రితం సడన్ గా నా ప్రేయసి అంటూ మిహికా బజాజ్ ని పరిచయం చేశారు. పరిచయం చేసిన వెంటనే రోకా మరియు నిశ్చితార్ధ వేడుకలు, ఈనెలలో పెళ్లి చకచకా జరిగిపోయాయి. రానా -మిహికా పెళ్లి అత్యంత సన్నహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
రానా పెళ్ళికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ వేత్తలు మరియు వ్యాపారవేత్తలు హాజరుకానున్నప్పటికీ ఘనంగానే జరిగింది. కోవిడ్ వ్యాప్తి అలాగే ఆంక్షలు లేని పక్షంలో వీరి పెళ్ళికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు అన్ని పరిశ్రమలకు చెందిన నటులు హాజరు అయ్యేవారు.

ఐతే ఈ వివాహంలోఅక్కినేని సమంత, నాగచైతన్య సందడి చేశారు. దగ్గుబాటి రామానాయుడుమనవడు అయిన నాగ చైతన్య రానాకువరసకు బావమరిది అవుతాడు. దీనితోభార్య సమంతతో పాటు ఆయన వేడుకకు హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ ఉపాసన, అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరు అయ్యారు.
పెళ్ళైన తరువాత మొదటిసారికొత్తపెళ్లి కొడుకు రానా ఓ టాక్ షోలో పాల్గొన్నారు. బాలీవుడ్ నటి నేహాధూపియానిర్వహించేనో ఫిల్టర్ నేహా టాక్ షోలో ఆయన పాల్గొనడం జరిగింది. జూమ్ యాప్ లో రానాను ఇంటర్వ్యూ చేసిన నేహా అనేక ఆసక్తికర విషయాలుఅడిగి తెలుసుకున్నారు.
అలాగే రానాను ఆమె హనీమూన్ గురించి అడిగారు. భార్య మిహికా బజాజ్ తో హనీమూన్ కి ఎప్పుడు వెళుతున్నారు అని నేహా అడిగారు.రానా కరోనా వైరస్ లేకపోతే హనీమూన్ కోసం యాంస్టర్డామ్ వెళదామునుకున్నారట. ఆర్ట్ అంటే తనకు ఇష్టమట, అందుకేఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే హనీమూన్ ఉంటుందని ఆయన చెప్పారు.

Latest Videos

click me!