కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోస్, సీరియల్స్ లోనూకనిపించిన సందర్భాలున్నాయి. గ్లామర్ నటిగా, సాంప్రదాయమైన అమ్మాయిగా, పేదింటి బిడ్డగా, రిచ్ కిడ్‌గా ఇలా పాత్ర ఏదైనా వాటిలోకి పరకాయ ప్రవేశం చేసి పాత్రని రక్తికట్టించడం ఆమె ప్రత్యేకత. ఇక నెగటివ్ రోల్స్ లో అయితే రమ్యకృష్ణ విశ్వరూపం చూపిస్తుందని చెప్పొచ్చు. `నరసింహ`లో నిలాంబరిగా అదరగొట్టింది. `బాహుబలి`లో శివగామిగా తన పీక్ నటనని ఆవిష్కరించింది.