మరోవైపు శృతి, ప్రేమ్ (Prem ) లు గుడిలో ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ఉండగా అక్కడకు ఒక పూజారి వచ్చి వివరాలు అడుగుతాడు. దాంతో ప్రేమ్ పెద్ద వాళ్ళు మమ్మల్ని కట్టుబట్టలతో బయటకు పంపించారు అని చెబుతాడు. ఇక పూజారి (Poojari) గుడిమూసే వేళయింది మీరు వేరే దారి చూసుకోండి అన్నట్లు మాట్లాడతాడు.