రామాయణం సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రణ్‌బీర్ కపూర్ నుండి సాయి పల్లవి వరకు, సినిమాలో నటిస్తున్న స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకి ఇటీవలే సెన్సార్ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ల రెమ్యునరేషన్లు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. .
27
రణ్‌బీర్ కపూర్
రామాయణం సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, సినిమా మొదటి భాగానికి ఆయన 75 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మూడు భాగాలకు 225 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.
37
యష్
సూపర్‌స్టార్ యష్ రావణాసురుడిగా నటిస్తున్నారు. దీనికి ఆయనకు 50 కోట్ల పారితోషికం దక్కింది. మూడు భాగాలకు 150 కోట్లు అందుకుంటున్నాట్టు తెలుస్తోంది.