పవన్ మంచాన పడింది కోవిడ్ తో కాదు, వకీల్ సాబ్ కలెక్టన్స్ చూసి ... వర్మ సంచలనం

First Published Apr 17, 2021, 11:38 AM IST

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోవడం వర్మకు అలవాటే. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీసేలా వర్మ చేసిన సినిమాలు, కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. సహనం కోల్పోయిన ఫ్యాన్స్, వర్మ ఆఫీస్ పై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా మరోమారు పవన్ ని టార్గెట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్స్ వేశాడు. పవన్ కళ్యాణ్ కి కరోనా సోకినట్లు నిన్న వార్తలు వచ్చాయి. ఆ కాసేపటికే పేషెంట్ లో బెడ్ పై ఉన్న పవన్ ఫోటోలు బయటికి వచ్చాయి. ఆ ఫోటోలను ఉద్దేశిస్తూ వర్మ వరుస ట్వీట్స్ వేశాడు.
undefined
పరోక్షంగా పవన్ నాటకం ఆడుతున్నాడని, అతనికి కరోనా సోకడం నిజం కాదని ఆయన ట్వీట్స్ వేశాడు. తిరుపతి బై  ఎలక్షన్స్ నేపథ్యంలో సింపథీ కోసం పవన్ కళ్యాణ్ ఇలా నటిస్తున్నారని కొందరు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాటలనే ఉద్దేశిస్తూ వర్మ మరింత రెచ్చిపోయాడు.
undefined
మొదటి ట్వీట్ లో.. ఒక నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్ ని ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టేసింది అంటే, అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువర్ హానర్!
undefined
మరో ట్వీట్ లో ... హే పీకే ప్యాన్స్ చాలా మంది వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్ నాకొడుకులు పవన్ కళ్యాణ్ ఇలా మంచాన పడడానికి కారణం కోవిడ్ కాదు, వకీల్ సాబ్ కలెక్షన్స్ అంటున్నారు... రండి కదలిరండి, ప్రాణాలకి తెగించి పీకే జేబులు నింపుదాం
undefined
ఇక మరో ట్వీట్ లో దర్శకుడు రాజమౌళిని కూడా లాగాడు.. పవన్ కళ్యాణ్ పడుకున్న గది ఆర్ట్ సెట్టింగ్ లో ఏదో మిస్టేక్ ఉంది. రాజమౌళి సర్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ని అడిగి, లోపం ఏమిటో చెబుతారా ప్లీజ్..
undefined
పవన్ కళ్యాణ్ బెడ్ పై పడుకున్న ఫొటోలో ఒక ఫేక్ విషయం దాగుంది. అది ఏమిటో చెప్పినవారి ఫోటో పెట్టడంతో పాటు, రివార్డ్ ఇస్తాను... అని మరొక ట్వీట్ లో వర్మ కామెంట్ చేశారు.
undefined
ఇక చివరి ట్వీట్ లో... ఫేక్ అని నేను అనట్లేదు, వేరే హీరోల దగుల్బాజీ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ళ ఆట కట్టించడానికి పీకే ఫ్యాన్ గా ఆ ఛాలెంజ్ విసిరాను.. అంటూ వర్మ కామెంట్ చేశారు.
undefined
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేవిగా ఉన్న ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మపై విరుచుకుపడుతున్నారు. బండ బూతులు తిడుతూ, కామెంట్స్ తో కసి తీర్చుకుంటున్నారు.
undefined
click me!