మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో.. ఇటు మెగా ఫ్యామిలీ.. అటు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈక్రమంలో రామ్ చరణ్ తన వారసుడికి ఏం పేరు పెట్టబోతున్నాడన్న విషయం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గ్లోబల్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు రెండవ సారి తల్లిదండ్రులు కావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జనవరి 31 ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒకరు మగపిల్లాడు కాగా.. మరొక ఆడబిడ్డ కూడా పుట్టింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తమ వారసుడి ఎంట్రీతో మెగా కుటుంబంతో పాటు.. అభిమానుల్లో కూడా ఆనందం రెట్టింపు అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
25
వారసుడి కోసం ఎదురుచూసిన చిరంజీవి..
మెగా ఫ్యామిలీలో మూడవ తరంలో అందరికి ఆడపిల్లలే పుట్టారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ కు మాత్రం మగపిల్లాడు పుట్టాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మాత్రం ఆడ బిడ్డలే ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక మగబిడ్డ పుడితే బాగుంటుందనే కోరికను చిరంజీవి పలు సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో చిరంజీవి కొన్ని విమర్శలు కూడా ఫేస్ చేశారు. అంతే కాదు రామ్ చరణ్ బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లినప్పుడు కూడా.. ఆయన తల్లి పంపిన ప్రత్యేక వీడియో సందేశంలో మగబిడ్డ కావాలని కోరుకున్నట్లు వెల్లడైంది. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ కోరిక నెరవేరినందుకు వారు ఎంతో ఆనందంగా ఉన్నారు.
35
రామ్ చరణ్ వారసుడికి ఏం పేరు పెట్టబోతున్నాడు..?
రామ్ చరణ్ ముగ్గరు బిడ్డలకుతండ్రి అయ్యాడు.. ఈ సంతోషకరమైన విషయంతో పాటు.. ప్రస్తుతం మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదే రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టబోతున్నారు.? ఇప్పటి వరకు చూసుకుంటే.. మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లలకు ఆంజనేయ స్వామి కలిసివచ్చేలా నామకరణం చేస్తుంటారు. లేదా శ్రీరాముడి పేరు కలిసేలా పెడుతుంటారు.
కానీ మొదటి సారి రామ్ చరణ్ తన కూతురికి ఆ సెంటిమెంట్ తో.. కాకుండా డిఫరెంట్ గా పేరు పెట్టాడు. రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి కూతురికి ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టారు. ఈ పేరు లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్టు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్, ఉపాసన తమ కవల పిల్లల విషయంలో కూడా అదే తరహా ఆధ్యాత్మిక అర్థం కలిగిన పేర్లు పెట్టబోతున్నారా, లేక ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా నామకరణం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వారసుడికి ఎవరు పేరు పెడతారు అనే అంశంపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. అటు అభిమానులు కూడా పేర్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
55
అభిమానులు ఎదురుచూపులు ఈసారైనా..?
మెగా అభిమానుల్లో మరో లోటు ఉండిపోయింది. అదేంటంటే.. రామ్ చరణ్ కూతురు క్లింకారాను ఇంత వరకూ ఎవరికీ వారు చూపించలేదు. ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అభిమానులు ఎప్పటి నుంచో ఈవిషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక తాజాగా చరణ్ కవల పిల్లలను కనడం.. అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో... అభిమానులకు ఆ పిల్లలను చూపిస్తారా..? లేక గతంలో మాదిరిగానే దాచేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చరణ్ తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడో?