బాబాయ్‌ కోసం అమ్మతో కలిసి రామ్‌ చరణ్‌.. ఫ్రెండ్‌ కోసం అల్లు అర్జున్‌.. ఎలక్షన్‌ ఫినిషింగ్‌ టచ్‌

Published : May 11, 2024, 02:41 PM IST

బాబాయ్‌ కోసం రామ్‌ చరణ్‌, తల్లి సురేఖ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుగా, స్నేహితుడి కోసం బన్నీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుడటం విశేషం.   

PREV
17
బాబాయ్‌ కోసం అమ్మతో కలిసి రామ్‌ చరణ్‌.. ఫ్రెండ్‌ కోసం అల్లు అర్జున్‌.. ఎలక్షన్‌ ఫినిషింగ్‌ టచ్‌

ఏపీలో ఎన్నికల వేడి పీక్‌కి చేరింది. ఈరోజు సాయంత్రంతో ప్రచారానికి తెరబడబోతుంది. ఈ క్రమంలో మెగా హీరోలు ఎలక్షన్లకి సంబంధించిన ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వబోతున్నారు. ఎన్నికల హీటుని మరింత పెంచుతున్నారు. ఓ వైపు రామ్‌ చరణ్‌, మరోవైపు అల్లు అర్జున్‌ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటుడటం విశేషం. ఇదిప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది.  
 

27

అల్లు అర్జున్‌ ఇటీవలే తన మామయ్య, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ గా ట్వీట్‌ చేశారు. ఆయన గెలవాలని కోరుకున్నారు. ఈ ట్వీట్‌ జనసేన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్‌కి సపోర్ట్ గా నిలవడంతో ఇక పవన్‌కి తిరుగులేదని అంతా భావిస్తున్నారు. 
 

37

ఈ నేపథ్యంలో ఇప్పుడు బన్నీ ఏకంగా వైఎస్‌ఆర్‌సీపీకి ప్రచారం చేస్తుండటం గమనార్హం. నంధ్యాలలో బన్నీ స్నేహితుడు  రవిచంద్ర కిశోర్‌ రెడ్డి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో ఆయన కోసం నంధ్యాలలో ప్రచారం చేశారు బన్నీ. ఆయన నంధ్యాల చేరుకుని సందడి చేశారు. 
 

47

దీంతో బన్నీ వస్తున్నారని తెలియడంతో ఆయన అభిమానులు వేలాది మంది ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వేలాది మంది అభిమానులకు అభివాదం తెలియజేశారు బన్నీ. ఈ మేరకు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. బన్నీ రాకతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిలో ఉత్సాహం పెరిగింది. సక్సెస్‌ ఆనందం కనిపిస్తుంది. 
 

57

మరోవైపు బాబాయ్‌ పవన్‌ కోసం రంగంలోకి దిగారు రామ్‌చరణ్‌. తల్లి సురేఖతో కలిసి ఆయన పిఠాపురం వెళ్లారు. రాజమండ్రికి చేరుకున్న రామ్‌చరణ్‌కి భారీగా అభిమానులు తరలి వచ్చిన ఆయనకు స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. 
 

67

అక్కడ నుంచి పిఠాపురం వెళ్లిన రామ్‌ చరణ్‌, సురేఖ.. అక్కడ శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. స్వామివారి ఆశిస్సులు తీసుకుంటారు. పవన్ గెలుపుకోసం దేవుడిని దర్శించడం విశేషం. అనంతరం పిఠాపురంలో ర్యాలీలో పాల్గొంటారని తెలుస్తుంది. పవన్‌ తరఫున ప్రచారం చేస్తూ అక్కడ జనాల్లోఉత్తేజాన్ని నింపబోతున్నారు. 

77
Jagan

ఇదిలా ఉంటే ఈ రోజే పిఠాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ కూడా అక్కడ ప్రచారంలో పాల్గొంటుడటం విశేషం. దీంతో పిఠాపురం వేడికెక్కింది. ప్రచారం పీక్‌కి చేరుకుంది. ఎన్నికల హీటు మరింతగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పెద్ద మిస్టరీగా మారింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories