
బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఇలా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
బాలయ్యకి గత పది పదిహేనేళ్లలో బోయపాటి శ్రీనునే మూడు విజయాలు ఇచ్చాడు. అవి తప్ప మరేదీ ఆడలేదు. ఒక్క హిట్ వస్తే, మూడు నాలుగు పరాజయాలు వెంటాడాయి. మళ్లీ బోయపాటితో సినిమా చేస్తేనే హిట్ వస్తుందనే పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బాలయ్య ప్రతి సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు. తన సేఫ్ జోన్ దాటి సినిమాలు చేస్తున్నారు.
ఇటీవల అనిల్ రావిపూడితో `భగవంత్ కేసరి` చిత్రంలో నటించారు బాలయ్య. ఇది బాలయ్య జోనర్ మూవీ కాదు, ఇందులో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, కూతురు సెంటిమెంట్, ఇన్‌స్పైర్ చేసే అంశాలు ఉన్నాయి. బాలయ్యకి ఓ కొత్త తరహా సబ్జెక్ట్ అని చెప్పాలి. అయినా ఈ మూవీతో హిట్ కొట్టాడు. ఇలా `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`తో మూడు హిట్లని అందుకున్నారు.
అంతేకాదు బాలయ్య తన కంఫర్ట్ జోన్ దాటి కొత్త యాంగిల్‌ని ఆవిష్కరించారు. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షో చేసి మెప్పించారు. ఇది ఇండియాలోనే టాప్ రేటెడ్ షోగా నిలిచింది. ఫస్ట్ టైమ్ బాలయ్య చేసిన షో కావడం విశేషం. దీంతో ఆయనలోని ఫన్నీ యాంగిల్, కామెడీ యాంగిల్ ఇందులో చూపించారు. అది ఆడియెన్స్ కి బాగా నచ్చింది. దీంతో షోని టాప్‌లో నిలబెట్టారు.
బాలకృష్ణ అంటే సీరియస్‌గా ఉంటారు, కొడతారు అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. పబ్లిక్‌లో కొన్ని అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. దీంతో అలాంటి అభిప్రాయం ఆయనపై ఉంది. కానీ తాను మాత్రం అది కాదని, తనలోని ఓ భోళా పర్సన్ ఉన్నాడని, మంచి కామెడీ యాంగిల్ ఉందని ఈ షో తెలియజేసింది. అందరిని ఆకట్టుకుంది. అందుకే రెండు సీజన్లు విజయవంతంగా రన్ అయ్యాయి.
అయితే బాలయ్యలో వచ్చిన మార్పుకి, సినిమాల పరంగా వరుస విజయాలకు సంబంధించిన ఓ బలమైన కారణం ఉందట. దాని వెనకాల ఓ వ్యక్తి ఉన్నారట. అది ఎవరో కాదు ఆయన చిన్న కూతురు తేజస్విని ఉన్నారట. ఆమెకి క్రియేటివ్ సైడ్ మంచి టాలెంట్ ఉందని, సినిమా మేకింగ్, ప్రొడక్షన్ వంటి వాటిపై ఆసక్తి ఉందని, సినిమాల్లో ఆమె ఇన్‌వాల్వ్ అవుతుందని తెలిపారు బాలయ్య చిన్న అల్లుడు, తేజస్విని భర్త భరత్.
బాలయ్య యంగ్ డైరెక్టర్లతో పనిచేయడానికి కారణం తేజస్వినే అని, స్క్రిప్ట్ కి సంబంధించినగా,ఈ చేసే సినిమాలకు సంబంధించినగానీ బాలయ్య ప్రతిదీ తేజూతో డిస్కస్ చేస్తారట. ఆమె ఇన్‌వాల్వ్ మెంట్ ఉంటుందని తెలిపారు. ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిపారు. వీటిపై ఆమెకి ఆసక్తి ఎక్కువ మాత్రమే కాదు, మంచి పట్టు ఉందని కూడా భరత్ తెలిపారు. ఆమె ఫీడ్ బ్యాక్ ద్వారానే బాలయ్య యంగర్ డైరెక్టర్లతో పనిచేస్తున్నారని తెలిపారు.
యంగ్ స్టర్స్ తోచేయడం వల్ల ఫ్రెష్‌నెస్ వస్తుందని, అదే ఇప్పుడు బాలయ్య సక్సెస్ మంత్రగా మారిందన్నారు భరత్. దీని వెనుకాల తేజస్విని పాత్ర ఉంటుందన్నారు. `అన్‌స్టాపబుల్` షో కూడా బాలయ్యపై జనాల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది. తనని ఇష్టపడని వాళ్లు కూడా ఈ షో ద్వారా ఆయనకు దగ్గరయ్యారు. వీటి వెనకాల తేజ సపోర్ట్ ఉంటుందని, ఆమె అభిప్రాయాలు, సూచనలు ఉన్నాయని చెప్పారు భరత్.
అలా తేజస్విని ఎంట్రీతో బాలయ్య కెరీర్ టర్న్ తీసుకుందని, ఆయన క్రేజ్ మరింత పెరిగిందని చెప్పచ్చు. balakrishna ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ డిఫరెంట్ యాక్షన్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదితోనే విడుదల చేసే అవకాశం ఉంది.