మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త చెప్పిన రామ్‌చరణ్‌.. బాబాయ్‌ పవన్‌తో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్‌

Published : Apr 25, 2022, 12:06 PM IST

రామ్‌చరణ్‌ మరో హీరో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తే `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి సంచలనం క్రియేట్‌ అయ్యింది. అదే తన బాబాయ్‌ పవర్‌స్టార్‌తో కలిసి సినిమా చేస్తే ఆ సినిమా ఇంకెన్ని సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుందో మాటల్లో చెప్పలేం. ఈ సరికొత్త సంచలనానికి తెరలేపుతున్నారు రామ్‌చరణ్‌.   

PREV
15
మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త చెప్పిన రామ్‌చరణ్‌.. బాబాయ్‌ పవన్‌తో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్‌

Ram Charan ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. ప్రస్తుతం ఆయన తండ్రి మెగాస్టార్‌తో కలిసి చేసిన `ఆచార్య`(Acharya) చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. చరణ్‌కి జోడీగా పూజా హెగ్డే నటించింది. చిరుకి జంటగా కాజల్‌ నటించగా, ఆమె పాత్రని తీసేసినట్టు తెలుస్తుంది. 

25

ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్‌ నటించిన సిద్ధ పాత్ర సెకండాఫ్‌లో వస్తుందట. ఆయనది కీలకమైన పాత్ర తప్పితే, సినిమా మొత్తం ఉండదని చెప్పారు రామ్‌చరణ్‌.  మరో నాలుగు రోజుల్లో `ఆచార్య` రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో రామ్‌చరణ్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో బాబాయ్‌ పవన్‌ కళ్యాన్‌(Pawan Kalyan)తో సినిమాపై కూడా స్పందించింది. క్రేజీ న్యూస్‌ రివీల్‌ చేశారు. బాబాయ్‌ పవన్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. సరైన కథ కోసం వెయిట్‌ చేస్తున్నామని చెప్పారు. 

35

`బాబాయ్‌తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. మాకు సరిపడే కథ కోసం వెయిట్‌ చేస్తున్నాం. స్టోరీ సెట్‌ అయినప్పుడు మా కాంబినేషన్‌లో సినిమా కచ్చితంగా ఉంటుంది. పవన్‌ బాబాయ్‌తో సినిమాని నేనే నిర్మిస్తాను. అలాగే బాబాయ్‌ బ్యానర్‌లోనూ నేను నటిస్తాను` అని చెప్పారు చరణ్‌. పవన్‌, చరణ్‌ల కాంబినేషన్‌లో సినిమా అంటే అది భారీ మల్టీస్టారర్‌ కాబోతుందని వేరే చెప్పక్కర్లేదు. ఇదే సెట్‌ అయితే ఇదొక క్రేజీ చిత్రం అవుతుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మూవీ కాబోతుంది.Pawan Ram charan Multistarrer.

45

ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో RC15 లో నటిస్తున్నారు. ఇది పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో చరణ్‌ సీఎంగా కనిపిస్తారని టాక్‌. ద్విపాత్రాభినయం చేస్తున్నారట. మరోవైపు `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరితోనూ ఓ పాన్‌ ఇండియా చిత్రం చేయబోతున్నారు. శంకర్ మూవీ తర్వాత అది పట్టాలెక్కనుంది. 

55

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం క్రిష్‌తో `హరిహరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో `భవదీయుడు భగత్‌ సింగ్‌` సినిమా చేయనున్నారు. దీంతోపాటు సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా, అలాగే మరో రెండు రీమేక్‌లు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories