Kajal Aggarwal: బాంబు పేల్చిన కొరటాల శివ.. ఆచార్య నుంచి కాజల్ అవుట్, స్వయంగా చిరునే..

Published : Apr 25, 2022, 10:58 AM IST

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

PREV
16
Kajal Aggarwal: బాంబు పేల్చిన కొరటాల శివ.. ఆచార్య నుంచి కాజల్ అవుట్, స్వయంగా చిరునే..
kajal aggarwal

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. శనివారం రోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. 

 

26
kajal aggarwal

అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆచార్య చిత్రంలో కాజల్ పాత్ర గురించి అనేక అనుమానాలు మొదలయ్యాయి. ట్రైలర్ లో ఒక్క షాట్ లో కూడా కాజల్ కనిపించలేదు. దీనితో అసలు కాజల్ ఆచార్య చిత్రంలో ఉందా లేదా అంటూ అభిమానులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. 

 

36
kajal aggarwal

ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా కాజల్ ప్రస్తావన ఎక్కడా లేదు. దీనితో అనుమానాలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ.. ఈ చిత్రంలో కాజల్ పాత్రపై బాంబు పేల్చారు. ఆచార్యలో కాజల్ పాత్ర లేదని షాక్ ఇచ్చారు. 

46
kajal aggarwal

కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ని ఆ పాత్రకు ఫిట్ చేయడం సరైనది కాదు అనిపించింది. కాబట్టి ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే కాజల్ ని ఈ విషయంలో ఒప్పించారు. దీనితో కాజల్ ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని కొరటాల అన్నారు. కాజల్ ఆచార్య చిత్రంలోని లాహే లాహే సాంగ్ లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. 

56

అలాగే ఆచార్య చిత్రంలో చిరంజీవి పాత్రకు హీరోయిన్ ఉండరు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి కొంత మేర నిరాశ తప్పదు. సో చిరుకి ఏ చిత్రంలో రొమాన్స్ ఉండదు. కానీ యాక్షన్, డాన్సుల్లో మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. 

66
kajal aggarwal

ఈ చిత్రంలో రాంచరణ్ దాదాపు 40 నిమిషాల కీలక పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ధర్మస్థలి కథ ఏంటి.. అక్కడ చిరు, చరణ్ ఎం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.  

click me!

Recommended Stories