రామ్ చరణ్ తో ధనుష్‌ బాక్సాఫీస్ వార్, పెద్ది వర్సెస్ కార, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Published : Feb 05, 2026, 05:45 PM IST

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్‌కు వాయిదా పడింది.  సరిగ్గా అదే టైమ్ లో ధనుష్ మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి మీకు తెలుసా? 

PREV
14
రామ్ చరన్ పెద్ది కొత్త రిలీజ్ డేట్..

పాన్ ఇండియా స్టార్ హీరో  రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' ప్రపంచవ్యాప్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మొదట మార్చి చివరి వారంలో విడుదల చేయాలనుకున్నా, ఇప్పుడు కొత్త తేదీకి ఈ సినిమా రిలీజ్ డేట్ ను  మార్చారు.

24
పెద్ది సినిమాపై భారీగా అంచనాలు..

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రామ్ చరణ్ తో జోడీ కట్టింది.  ఇటీవల, జగపతి బాబు క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు టీమ్. ఇందులో ఆయన అప్పలసూరి పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

34
రామ్ చరణ్ - శివరాజ్ కుమార్ కాంబినేషన్‌లో

రామ్ చరణ్ - శివరాజ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. బాలీవుడ్ ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో ఓ భారీ ఫైట్ సీన్ చిత్రీకరించారు. ఈ ఫైట్‌లో రామ్ చరణ్, శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. గతంలో రెండు ప్లాప్ సినిమాలు చూసిన రామ్ చరణ్.. ఈసినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. 

44
రామ్ చరణ్ పెద్ది v/s ధనుష్ కార

ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న అప్ డేట్స్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈక్రమంలో పెద్ది సినిమా కొత్త రిలీజ్ డేట్ కు.. మరో స్టార్ హీరో ధనుష్ సినిమా కూడా రిలీజ్ కు ఉంది. ధనుష్ కార సినిమా కూడా ఏప్రిల్ 30నే రిలీజ్ అవుతుండటం విశేషం. బాక్సాఫీస్  దగ్గర రామ్ చరణ్, ధనుష్ పోటీపడబోతున్నారు. మరి విజయం ఎవరిది అనేది చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories