Peddi కథలో పెద్ద ట్విస్ట్ అదేనా ? అభిమానులని ఊరించే మరో మ్యాటర్ ఉంది, దాచిపెడుతున్నది అందుకే

Published : Apr 30, 2026, 12:45 PM IST

రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ లోపు ఈ మూవీలో రాంచరణ్ లుక్ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ గురించి రోజుకొక వార్త బయటకు వస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మార్చి 27నే రిలీజ్ కావలసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదా పడింది.

25
డైరెక్టర్ బుచ్చిబాబు

ఆ తర్వాత రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అని ప్రకటించారు. అది కూడా జరగలేదు. ఇటీవల కొంత కాలంగా జూన్ 25న ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీలో ఊహాగానాలు మొదలయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా పెద్ది మూవీ జూన్ చివరి వారంలో వస్తుంది అని చెప్పడంతో అదే ఫిక్స్ అవుతుందని అంతా భావించారు.

35
జూన్ 4న రిలీజ్ ?

తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి మరో ఊహాగానం మొదలైంది. జూన్ 4న ఈ చిత్రం వస్తుంది అంటూ ప్రచారం జోరందుకుంది. చిత్ర యూనిట్ కూడా జూన్ 4న రిలీజ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

45
ఐటెం సాంగ్ షూటింగ్

అయితే ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఐటెం సాంగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నెలరోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా అని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఏఆర్ రెహమాన్ రీ రికార్డింగ్ కి ఎంత టైం తీసుకుంటారు అనేది కూడా తెలియదు.

55
అందుకే రహస్యంగా

ఇదిలా ఉండగా పెద్ది చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రంలో రాంచరణ్ కి సంబంధించిన 2 లుక్స్ రిలీజ్ చేశారు. ఒకటి విలేజ్ క్రికెటర్ లుక్ మరొకటి కుస్తీ వీరుడిగా కనిపించే లుక్. అయితే కథలో అత్యంత కీలకమైన మరో లుక్ ఉందట. మొత్తం మూడు గెటప్స్ లలో రాంచరణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కథలో అత్యంత కీలకమైన గెటప్ అదే అని అందుకే రహస్యంగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories