రాంచరణ్ నేవీ ఆఫీసర్ గా హై బడ్జెట్ మూవీ.. ప్రభాస్ ఫ్రెండ్స్ వల్ల ఫ్యాన్స్ లో కంగారు ?

Published : Dec 27, 2022, 12:37 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

PREV
16
రాంచరణ్ నేవీ ఆఫీసర్ గా హై బడ్జెట్ మూవీ.. ప్రభాస్ ఫ్రెండ్స్ వల్ల ఫ్యాన్స్ లో కంగారు ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాంచరణ్   నటిస్తున్న చిత్రాలపై హైప్ పెరిగిపోతోంది. దీనితో చరణ్ కూడా తన చిత్రాలు విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

 

26

శంకర్ మూవీ తర్వాత రాంచరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే రాంచరణ్ చిత్రాల లైనప్ లో మరో మూవీ చేరబోతున్నట్లు తెలుస్తోంది. 

 

36

కన్నడ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో నటించేందుకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తి కథ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నర్తన్ నేవీ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన యాక్షన్ స్టోరీ అల్లుతున్నారట. రాంచరణ్ ఓకే చెప్పఁడంతో స్క్రిప్ట్ వర్క్ జోరందుకున్నట్లు తెలుస్తోంది. 

 

46

నర్తన్ మఫ్టీ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో చరణ్ వర్క్ చేయనుండడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ ఒక విషయం వారిని కలవర పెడుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ కాంబినేషన్ సెట్ చేసింది వారేనట. రాంచరణ్ డేట్స్ యువి వారి వద్ద ఉన్నాయి. 

 

56

గతంలో గౌతమ్ తిన్ననూరి, చరణ్ కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది కుదర్లేదు. దీనితో హడావిడిగా నర్తన్ ని లైన్ లోకి తీసుకువచ్చారు. యువీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తో వారు చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

 

66

భారీ బడ్జెట్ చిత్రాల్ని హ్యాండిల్ చేయలేరు అనే అపవాదు మూటకట్టుకున్నారు. ఈ అంశమే రాంచరణ్ అభిమానులని కంగారు పెడుతోంది. నేవీ బ్యాక్ డ్రాప్ అంటే మామూలు వ్యవహారం కాదు. విజువల్స్ గ్రాండ్ గా ఉండాలి. కథ పక్కాగా ఉండాలి. దీనితో ఏం జరుగుతుందో అని మెగా అభిమానులు కలవరపడుతున్నారు. త్వరలో ఈ చిత్ర ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. 

 

click me!

Recommended Stories