మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్ నెస్ ను ఎంత కాపాడుకుంటాడో.. అంత ఇష్టంగా నచ్చిన ఫుడ్ ను తింటాడు. ఎక్కడికి వెళ్లినా.. ఇంటి ఫుడ్ ను ఇష్టపడే రామ్ చరణ్ ఇంట్లో ఎవరి వంటను ఇష్టపడతాడో తెలుసా? ఉపాసన వంట చేస్తుందా?
పెద్ది సినిమాతో రచ్చ చేశాడు రామ్ చరణ్. ఈ సినిమాలో చెర్రీ ఫిట్ నెస్ చూసి కళ్లు చెదిరి పోయింది. అభిమానులు చరణ్ ను చూసి పండగ చేసుకుంటున్నారు. కెరీర్ లో ఒక్కో స్టెప్ ఎక్కుతూ వస్తున్నాడు మెగా పవర్ స్టార్.. ఫిట్ నెస్ యాక్టింగ్, డాన్స్, యాక్షన్, డిఫరెంట్ లుక్స్ ఇలా చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా సినిమాకు కొత్తదనం చూపించుకుంటూ.. నిజమైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు.
మెగాస్టార్ ని కూడా దాటుకుని తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అభిమానులను అలరించడానికి చాలా కష్టపడుతున్నాడు చరణ్. కండలు తిరిగిన శరీరం కోసం జిమ్ లో చాలా కష్టపడుతూ.. కఠినమైన డైట్ ఫాలో అవుతున్నాడు. చరణ్ జిమ్ లో ఎంత కష్టపడుతున్నాడో.. ఎలాంటి డైట్ ను ఫాలో అయినా.. ఫుడ్ విషయంలో మాత్రం మనసు చంపుకోడు. ఇంట్లో చేసిన వంటలను మనస్పూర్తిగా తింటాడు.
25
రామ్ చరణ్ కు ఎవరి వంటలంటే బాగా ఇష్టం..
మెగా పవర్ స్టార్ కు బయట తినడం కంటే ఇంటి వంటలంటేనే బాగా ఇష్టం. ఆయన చిరంజీవితో కలిసి ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. వారి ఇంట్లో ఎంతో మంది పనివారు ఉంటారు. అయితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి తల్లి అంజనమ్మ, భార్య సురేఖ తో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కు కూడా వంట చేయడం వచ్చు. ఈముగ్గురిలో ఎవరి వంట చరణ్ చాలా ఇష్టంగా తింటాడు అంటే.. నాన్నమ్మ అంజనమ్మ పేరే చెపుతుంటాడు. ఓ ప్రోగ్రామ్ లో సురేఖ ఈ విషయాన్ని వెల్లడించారు. నా చేతి వంట కంటే కూడా చరణ్ వాళ్ల నాన్నమ్మ వంటనే బాగా ఇష్టపడతాడని ఆన్నారు.
35
ఉపాసన వంట చేస్తుందా..?
ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన వంట చేస్తుందా.. చరణ్ కు ఆమె వండిపెడుతుందా అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. ఉపాసన వేల కోట్ల ఆస్తులకు వారసురాలు..మెగా ఫ్యామిలీ పెద్ద కోడలు, అంతే కాదు బిజినెస్ ఉమెన్ కూడా. ఆమెకంటూ ఓ స్టేటస్ ఉంది. అయినా సరే కుటుంబంలో చాలా సాదాసీదా కోడలిలా కనిపిస్తుంటుంది ఉపాసన. తన భర్తకు ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది. అతను ఏం తింటాడో అవన్నీ చేయిస్తుంది. అప్పుడప్పుడు గరిటె పట్టుకుని వంట చేస్తుంది కూడా. గతంలో చరణ్ కు ఇష్టమని స్పెషల్ గా ఆవకాయ తన చేత్తో స్వయంగా పెట్టింది ఉపాసన. ఆ వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది కూడా. చరణ్ ఎప్పుడు ఏం తింటాడు.. అనేది ఆమెకు బాగా తెలుసు.
రామ్ చరణ్ షూటింగ్ లో ఉన్నా.. ఇంటి నుంచి ఫుడ్ వెళ్తుంది. లేదా కొంత మంది చెఫ్ లు ఆయన వెంట వెళ్లి.. డైట్ ప్రకారం వండిపెడుతుంటారు. రామ్ చరణ్ తన నాన్నమ్మ అంజనా దేవి చేసిన చేపల పులుసంటే చాలా ఇష్టంగా తింటాడట. ఇక రెగ్యులర్ డైట్ లో రసం పక్కాగా ఉండాలసిందేనట. రసం కూడా చరణ్ తల్లి సురేఖ చేస్తే ఇష్టంగా తింటాడట. ఎక్కడికి వెళ్లినా రసం ఉంటే చాలు.. కాస్త రైస్ కలిపేసుకుని తినేస్తాడట చరణ్. డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే రసం ఉందా అని ముందే అడిగేస్తాడట చరణ్. అందుకే సురేఖ ఓ రెడిమేడ్ రసం ఫౌడర్ ను తయారు చేయించి.. . చరణ్ వెంట వెళ్లిన వంటవారితో పంపిస్తుందట. ఈ విషయాలను ఓ సందర్భంలో ఉపాసన వెల్లడించారు.
55
ఉపాసన మాట్లాడుతూ..
ఇంతటి డెడికేటెడ్ ఫిట్‌నెస్ ఫాలో అవుతూ కూడా చరణ్ కు రసం రైస్ పట్ల ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదని ఉపాసన తెలిపింది. అంతేకాదు, తనకైతే రాగి సంగటి, మటన్ పులుసు బాగా ఇష్టమని ఉపాసన అన్నారు. తన కూతురికి కూడా ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజూ రాగి జావ తినిపిస్తానని చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా మంచి ఫుడీస్ అని , షూటింగ్స్ లేనప్పుడు రకరకాల వంటలు చేసి కుటుంబసభ్యులు అంతా కలిసి భోజనం చేస్తామని ఆమె అన్నారు.