
స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్‌రాజుకి రామ్ చరణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఒక వార్నింగ్ నోట్‌ని పంచుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరి దిల్ రాజుకి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అసలేం జరిగిందనేది చూస్తే, రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది. కానీ డిజాస్టర్‌గా నిలిచింది.
`గేమ్ ఛేంజర్` వల్ల నిర్మాతకు భారీగా నష్టాలు వచ్చాయి. వందకోట్లకుపైగానే నష్టపోయినట్టు సమాచారం. అదే సమయంలో దిల్ రాజు నిర్మించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది.
`గేమ్ ఛేంజర్` నష్టాలను 70శాతం వరకు ఇది భర్తీ చేసినట్టు నిర్మాత శిరీష్ తెలిపారు. కానీ `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ అయితే దర్శకుడు శంకర్‌గానీ, హీరో రామ్ చరణ్ గానీ ఫోన్ చేయలేదనీ,
కనీసం కర్టసీ కోసమైనా మాట్లాడలేదని నిర్మాత శిరీష్ `తమ్ముడు` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది వైరల్‌గా మారింది. ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ అవుతుంది.
దీనికితోడు దిల్ రాజు కూడా పలు ఈవెంట్లలో `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ అని కొన్ని మిస్టేక్స్ జరిగాయని, తప్పు తనదే అని వెల్లడించారు. పెద్ద దర్శకుడి సినిమా కావడంతో తాను ఇన్ వాల్వ్ కాలేకపోయానని, ఓ దశలో సినిమా తమ చేతులు దాటిపోయిందని తెలిపారు.
పెద్ద దర్శకుడితో సినిమా చేస్తున్నప్పుడు రూల్స్ రెగ్యూలేషన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలని ముందే అన్నీ మాట్లాడుకోవాలని తెలిపారు.
ఇలా ప్రతి ఈవెంట్లలోనే ఈ మూవీ ప్రస్తావన వస్తోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దిల్‌రాజుకి వార్నింగ్ ఇస్తూ నోట్‌ని విడుదల చేశారు.
ఇందులో ఏం చెప్పారనేది చూస్తే, `సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి అని అందరికి తెలుసు.
మీ ప్రొడక్షన్ హౌస్‌లో మీరు చేసే సినిమాలు మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయి అని చెప్పుకునే మీరు, ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాధించడం ఎంత వరకు సమంజసం.
`వన్ నేనొక్కడినే` టైమ్‌లో 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారి అయినా మాట్లాడారా?, మైత్రీ బ్యానర్‌లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి మాట్లాడారా? `సైంధవ్` ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
`సంక్రాంతికి వస్తున్నాం` సినిమా హిట్ అయితే వెంకటేష్ కి ఎంత ఇచ్చారు? ముందు మాట్లాడుకున్నంతే ఇచ్చారా? ఎక్కువ ఏమైనా ఇచ్చారా?` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చరణ్ ఫ్యాన్స్.
అంతేకాదు `దర్శకుడు శంకర్ ఉన్నాడు అని రామ్ చరణ్ వద్దకు వెళ్లింది ఎవరు? ఒక్క ఏడాది అంటూ మూడేళ్లు వృథా చేసింది ఎవరు? `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరెక్టేనా?
మా అభిమానులు మూడేళ్లుగా ఒక సినిమా కోసం ఎదురుచూసి అది కూడా ఫ్లాప్ అయ్యిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతి రోజూ ఇదే విషయం మీద మాట్లాడుతూ, హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారు.
ప్రతి పెస్ మీట్ లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే దీని గురించే చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక, ఇంకోసారి `గేమ్ ఛేంజర్` సినిమా గురించి గానీ, రామ్ చరణ్ గురించి గానీ తప్పుగా మాట్లాడితే
ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుంది ఖబర్దార్` అంటూ రామ్ చరణ్ అభిమానులు పేరుతో ఒక వార్నింగ్ నోట్‌ని విడుదల చేశారు. ఇది నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిపై దిల్ రాజు, శిరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి.