రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో నటించిన హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో నటించిన హీరోయిన్లలో తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో రాంచరణ్ రివీల్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోయిన్లతో నటించారు. రాధిక, రాధా, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చిరంజీవి ఎక్కువ సినిమాలు చేశారు. హీరోయిన్లు ఎంత బాగా డ్యాన్స్ చేసినా చిరంజీవి చేసే డ్యాన్సులు బాగా అభిమానులని ఆకట్టుకునేవి. రాధా, విజయశాంతి లాంటి వారు చిరంజీవితో పోటీగా డ్యాన్స్ చేయాలని ప్రయత్నించేవారు.
25
రాంచరణ్ కి ఇష్టమైన హీరోయిన్
రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాన్నగారితో నటించిన హీరోయిన్లలో రాధా గారు అంటే తనకు బాగా ఇష్టం అని తెలిపారు. నాన్న గారు, రాధా గారు డ్యాన్స్ చేస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది. రాధా గారు పర్ఫెక్ట్ టైమింగ్ తో డ్యాన్స్ చేసేవారు. కొంచెం ఎక్కువ, తక్కువ కూడా అయ్యేది కాదు. ఈ విషయాన్ని రాంచరణ్ తమన్నాతో చెప్పారు.
35
ఆమె డ్యాన్స్ పర్ఫెక్ట్
నాకు తెలిసి రాధా గారి తర్వాత అంత పర్ఫెక్ట్ గా హీరోలతో డ్యాన్స్ చేసేది మీరే అని తమన్నా పై రాంచరణ్ ప్రశంసలు కురిపించారు. ఈ విషయం నేను చెప్పట్లేదు. చాలా మంది చెప్పారు. నాన్నగారు కూడా అన్నారు అంటూ రాంచరణ్ రివీల్ చేశారు.
ఇలాంటి కోస్టార్స్ ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్ అని రాంచరణ్ తెలిపారు. రాంచరణ్, తమన్నా ఇద్దరూ రచ్చ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.
55
వాళ్ళిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు ?
ఆ తర్వాత రాంచరణ్ తమన్నాని అల్లు అర్జున్, ఎన్టీఆర్ గురించి ప్రశ్నించారు. వీళ్లిద్దరితో కూడా తమన్నా నటించింది. వీళ్ళిద్దరిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని రాంచరణ్ ప్రశ్నించారు. దీనికి తమన్నా బదులిస్తూ తాను డ్యాన్స్ బాగా చేస్తున్నాను అంటే అందుకు కారణం అల్లు అర్జున్ అని తమన్నా పేర్కొంది. డ్యాన్స్ విషయంలో బన్నీ నాకు హెల్ప్ చేశాడు. ఇక తారక్ విషయానికి వస్తే తారక్ నేచురల్ డ్యాన్సర్. కానీ అంతకంటే ఎక్కువగా తారక్ డైలాగ్ డెలివరీ అంటే ఇష్టం అని తమన్నా పేర్కొన్నారు.