పెళ్లి తర్వాత పొట్టి దుస్తులు, నా డ్రెస్సింగ్ మారదు..ట్రోలింగ్ ఎదురవుతున్నా మ్యాటర్ క్లియర్ గా చెప్పేసింది

Published : Mar 21, 2024, 06:53 PM IST

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది.

PREV
16
పెళ్లి తర్వాత పొట్టి దుస్తులు, నా డ్రెస్సింగ్ మారదు..ట్రోలింగ్ ఎదురవుతున్నా మ్యాటర్ క్లియర్ గా చెప్పేసింది

హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

26

రకుల్ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకుంది. ఎంతో గ్రాండ్ గా వీళ్లిద్దరి వివాహ వేడుక జరిగింది. 

36

పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తుల్లో, గ్లామర్ కాస్ట్యూమ్స్ లో రచ్చ రచ్చ చేస్తోంది. పెళ్ళైన వెంటనే రకుల్ ఇలా గ్లామర్ షో మొదలు పెట్టడంతో కాస్త ట్రోలింగ్ జరుగుతోంది. పెళ్ళైన తర్వాత సహజంగానే అభిమానుల్లో ఒక డైలమా ఉంటుంది. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతారు. మరికొంతమంది గ్లామర్ డోస్ తగ్గిస్తారు. 

46

ఇలాంటి అనుమానాలకు రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది. పెళ్లి తర్వాత ఫ్యాషన్ షోలో పాల్గొనడం.. గ్లామర్ అవుట్ ఫిట్స్ ధరించడంతో రకుల్ పై కాస్త ట్రోలింగ్ జరుగుతోంది. దీనితో రకుల్ సమాధానం ఇచ్చింది. పెళ్లి తర్వాత గ్లామర్ దుస్తులు వేసుకోకూడదు అనే వాదనపై రకుల్ మండిపడింది. 

56

పెళ్లి తర్వాత మీ అత్త మామలు మిమ్మల్ని డ్రెస్సింగ్, ఫ్యాషన్ మార్చుకోవాలని అడుగుతున్నారా అని ప్రశ్నించగా రకుల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను ఆ విషయంలో అదృష్టవంతురాలిని. నా భర్త జాకీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నా డ్రెస్సింగ్ విషయంలో మార్పు కోరుకోవడం లేదు. పెళ్లిని ఇండియాలో చాలా విభిన్నంగా చూస్తారని తెలుసు. 

66

ఇదే ప్రశ్నని మీరు అబ్బాయిలని అడగగలరా అని రకుల్ మండిపడింది. పెళ్లి తర్వాత అబ్బాయిలు సాంప్రదాయ వస్త్రాల్లో ఆఫీస్ లకు వెళతారా అని అడిగింది. ఇప్పుడు కాలం మారింది.. ప్రతి ఒక్కరిని సొంత అభిప్రాయాలు ఉన్నాయి. నేను నా అభిప్రాయాలని ఫాలో అవుతూ వెళతాను అని రకుల్ తేల్చి చెప్పింది. 

click me!

Recommended Stories