రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్‌.. సీక్రెట్‌ లీక్‌ చేసిన నటి..ఈ ఏడాదేనా?

First Published May 8, 2021, 2:36 PM IST

టాలీవుడ్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లికి రెడీ అవుతుందట. ఈ ఏడాదిలోనే ఆమె మ్యారేజ్‌ ప్లాన్‌ జరుగుతుందట. తాజాగా సీక్రెట్‌ బయటపడింది. ఓ షోలో రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్‌ బయటపడింది. 

గతేడాది కాజల్‌ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పటికే సమంత.. చైతూతో ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్‌ చేస్తుంది. దీంతో రకుల్‌ కూడా మ్యారేజ్‌ లైఫ్‌లోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉందట.
undefined
రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్స్ ఉన్నాయని తెలిసింది. మంచు లక్ష్మీ ఈ విషయాన్ని బయటపెట్టింది. రానా హోస్ట్ గా ప్రసారమయ్యే `నెం.1యారీ` షోలో ఈ విషయాన్ని రివీల్‌ చేసింది మంచు లక్ష్మీ. ఈ షోకి రకుల్‌తోపాటు మంచు లక్ష్మీ హాజరై అనేక విషయాలను పంచుకున్నారు.
undefined
రకుల్‌ మ్యారేజ్‌ విషయం చర్చకు రాగానే.. మంచు లక్ష్మీ స్పందించింది. ఈ ఏడాదిలోనే ఉంటుందని ఠక్కున చెప్పేసింది. అంటే వీరిద్దరి మధ్య దీనికి సంబంధించిన చర్చలు జరిగే ఉంటాయని చెప్పకనే చెప్పేశారు.
undefined
అయితే మంచు లక్ష్మీ చెప్పిన విషయాన్ని రకుల్‌ వారించింది. దీంతో పెళ్లి ప్రయత్నాలు మాత్రం జరుగుతాయని, లేదా ఓ బాయ్‌ ఫ్రెండ్ విషయంలోనైనా క్లారిటీ వస్తుందని చెప్పింది.
undefined
రకుల్‌ని చేసుకునే వాడు నా వద్దకి వస్తే ఆమె గురించి మొత్తం చెప్పేస్తానని పేర్కొంది. సరదాగా ఈ కన్వర్జేషన్‌ రకుల్‌ మ్యారేజ్‌ ప్లాన్‌ విషయాలను రివీల్‌ చేసినట్టయ్యింది. మరి మంచు లక్ష్మీ సరదాగా కామెంట్‌ చేసిందా? లేక తమ మధ్య చర్చకు వచ్చిన విషయాలను సడెన్‌గా చెప్పేసిందా అన్నది సస్పెన్స్ గా మారింది.
undefined
ఇదిలా ఉంటే రకుల్‌, మంచు లక్ష్మీ మంచి స్నేహితులు. వీరిద్దరు అన్ని విషయాలు పంచుకుంటారు. రకుల్‌ ఎంట్రీతోనే లక్ష్మీ లైఫ్‌ మారిందని పలు సందర్భాల్లో చెప్పారు. రానా కూడా ఈ షోలో తెలిపారు.
undefined
మరోవైపు రానా- రకుల్‌కి సంబంధించి గతంలో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇందులో నిజం లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపిన విషయం తెలిసిందే.
undefined
ఇప్పుడు మంచు లక్ష్మీ.. రకుల్‌ మ్యారేజ్‌ విషయాలను రివీల్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతా అన్నది వేచి చూడాలి.
undefined
ప్రస్తుతం రకుల్‌ తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ హీరో. తమిళంలో శివ కార్తికేయన్‌ `ఆయలాన్` చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ నాలుగు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రకుల్‌.
undefined
click me!