
ఈరోజు ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ వానపాము అనుకున్నాను కానీ తాచుపాములా నన్నే కాటేస్తుందని నేను అనుకోలేదు అనగా నేను మొదటి నుంచే చెబుతున్నాను కదా అక్క అనడంతో అని వాళ్ళ తమ్ముడు మీద సీరియస్ అవుతుంది రాజ్యలక్ష్మి. ఇప్పటికైనా సరిగ్గా ఆలోచించక్క అని అంటాడు బసవయ్య. దివ్య చేసిన పని మామూలు పని కాదు మన పరువు బజారుకీడ్చింది. నా కొడుకుకీ కోలుకోలేని దెబ్బ కొట్టింది అని అంటుంది. పాపం పిచ్చి నాగన్న మింగలేక కక్కలేక గిలాగిలా కొట్టుకుంటున్నాడు అని సంజయ్ గురించి మాట్లాడడంతో వాడి గురించి మాట్లాడకు వాడి వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది రాజ్యలక్ష్మి.
వాడు ఆ విషయం గురించి ముందే మాట్లాడి ఉంటే ఈపాటికి సెటిల్ చేసేదాన్ని కానీ ఆ దివ్య మీడియా ముందు ఇరికిచ్చి నాతో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలా చేసింది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఇప్పటివరకు హాస్పటల్ విషయాల్లోనే అనుకున్నాను ఇప్పుడు నా వ్యక్తిగత విషయాలు కూడా దూరింది ఇకపై దానిని నేను వదిలిపెట్టను అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. మరి దాన్ని జాబు తీసేయ్ అక్క అనడంతో అలా చేస్తే మనకేం లాభం, ఎక్కడ అయితే అది హీరోయిన్ అనిపించుకుందో అక్కడే అదే పది మంది ముందే దాన్ని విలన్ చేసి అందరూ దాన్ని అందరు నానా మాటలు అని అవమానించేలా చేస్తాను అనుకుంటూ ఉంటుంది.
మరొకవైపు దివ్య చేసిన పనికి హాస్పిటల్లో అందరూ కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉంటారు. నేను ఏం చేశానని మీరు అంతలా సంతోషపడుతున్నారు అనడంతో మీరు చాలా పెద్ద గొప్ప పని చేశారు మేడం అంటూ హాస్పిటల్లో స్టాప్ అందరూ దివ్యని పొగుడుతూ ఉంటారు. ఒకరకంగా ఇది విక్రమ్ గారి పర్సనల్ లైఫ్ అయినా మేనేజ్మెంట్ ని ఎదిరించారు ఆ విషయంలో మీకు భయం లేదా అని అనగా ఏం చేస్తారు మహా అయితే జాబ్ చేసేస్తారు అంతే కదా అని అంటుంది దివ్య. అప్పుడు దివ్య పని చేసుకుంటూ ఉండగా దివ్య ను చూసిన దేవుడు రాత్రికి రాత్రి హీరోయిన్ అయిపోయారు కానీ విక్రమ్ బాబుకు దూరమయ్యారు అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ దేవుడికి ఫోన్ చేస్తాడు.
ఏంట్రా దేవుడు నిన్ను నమ్ముకుని విజయవాడ వెళ్తే నువ్వు ఇలా చేసావు అని అంటాడు విక్రమ్. అప్పుడు విక్రం మాటలకు దేవుడు తింగరిగా మాట్లాడుతూ ఉండగా నీ మాటలు వింటే నీతో పాటు నన్ను కూడా సన్యాసంలో కలుపుకునేలా ఉన్నావు కదరా అనగా అదే ఫిక్స్ అయిపోండి బాబు అని అంటాడు దేవుడు. ఇదిగో ఏం చేస్తుంది ఆపరేషన్ అయిపోయిందా అనడంతో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఫెయిల్ అంటాడు. ఏంట్రా అనగా మీరేం ఎక్కువ ఆలోచించకండి బాబు అని అంటాడు దేవుడు. సరే ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అన్నావు కదా హాస్పిటల్ కి బొకే తెప్పించాను తీసుకొని వెళ్లి దివ్యకి ఇవ్వు అని అంటాడు విక్రమ్.
తర్వాత దేవుడు విక్రమ్ ఇచ్చిన బొకే తీసుకుని వెళ్లి ఇవ్వడంతో దివ్య సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు లాస్య క్యారం బోర్డులో గెలిచాము అని సంబరపడుతూ ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఆట ఎప్పుడు అన్ని వైపులా ఉంటుందని అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటుంది. లాస్య ఎప్పుడు ప్రత్యర్తిగా ఉండాలని అనుకోవద్దు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయినా లాస్య మీద గెలవాలి అన్న పంతంతో మళ్ళీ గేమ్ మొదలుపెడదామా అని అంటాడు నందు. అప్పుడు గేమ్ ఆడబోతుండగా ఇంతలో భాగ్య ఫోన్ చేయడంతో లాస్య పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు భాగ్య లాస్యకు జరిగింది మొత్తం వివరించడంతో లాస్య సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడు లాస్య భాగ్య కలసి దివ్య జీవితం నాశనం చేయడానికి ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత విక్రమ్ ప్రియ ని తీసుకొని ఇంటికి వస్తాడు. అప్పుడు రాజ్యలక్ష్మి ఆగండి అని ఉంటుంది. అప్పుడు విక్రమ్ వాళ్ళ తాతయ్య ఏంటి రాజ్యలక్ష్మి వాళ్ళని ఆగమన్నావు జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా అనగా అవన్నీ చేసుకునేవాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు మామయ్య అని అంటుంది రాజ్యలక్ష్మి. అప్పుడు రాజ్యలక్ష్మి ఏం చేయాలి అన్నది పంతులుగారు చెబుతారు అనగా అప్పుడు పంతులుగారు అమ్మాయి జీవితంలో దోషం ఉంది ఇప్పుడు ఇంట్లోకి రాకూడదు 101 రోజులపాటు ప్రతిరోజు 101 బిందువులతో అమ్మవారికి అభిషేకం చేయాలి అంటూ అబద్ధాలు చెబుతూ ఉంటాడు.
అప్పుడు పూజారి చెప్పిన మాటలకు ప్రియ టెన్షన్ పడుతూ ఉండగా రాజ్యలక్ష్మి సంజయ్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇలాంటి శాస్త్రాలు నేను ఎక్కడా వినలేదు. అమ్మాయి పుట్టింటిని వదిలేసి వచ్చింది ఎక్కడ ఉంటుంది ఎలా పూజ చేస్తుంది అని విక్రమ్ వాళ్ళ తాతయ్య అనడంతో అవుట్ హౌస్ ఉంది కదా అని అంటుంది రాజ్యలక్ష్మి. ఆ మాటలకు విక్రమ్ వాళ్ళ తాతయ్య షాక్ అవుతాడు. అప్పుడు ప్రియ ఈ ఇంటి కోడలుగా ఇంటి మంచి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం తాతయ్య గారు మీరు ఆలోచించకండి అంటూ ప్రియ రాజ్యలక్ష్మి మాటలను గుడ్డిగా నమ్ముతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ప్రియ మీద లేని ప్రేమను ఒలకబోస్తూ ఉంటుంది.
అప్పుడు ఎవరు దారిన వారు వెళ్ళిపోతారు. ఇప్పటివరకు జరిగింది చాలు ఇకపైన నన్ను నిష్టగా ఉండు అక్కడికి వెళ్లొద్దు అని విక్రమ్ కి వార్నింగ్ ఇస్తుంది రాజ్యలక్ష్మి. ఇల్లు శుభ్రం చేస్తుండగా అప్పుడు నందు అక్కడికి రావడంతో మీకు ఏదో శుభలేఖ వచ్చింది అక్కడ పెట్టాను అనగా ఎవరు ఇచ్చారు అనడంతో పరాయి వ్యక్తుల శుభలేఖలు లేఖలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనగా నేను పరాయి వ్యక్తినా అని నందు అనడంతో దాని అర్థం అదే కదా మళ్లీ ఎందుకు చెప్పించకొని బాధపడడం అంటుంది తులసి.అప్పుడూ నందు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుది పెళ్లి అని నందు చెప్పడంతో ఇంతలో పరందామయ్య వచ్చి ఫ్రెండ్ పెళ్లి కూతురు సరే రా మరి మీ కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని అంటాడు పరంధామయ్య. సమాధానం అడిగితే ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటి రా అనగా మాకు తెలిస్తే కథ మామయ్య మీకు చెప్పడానికి ఇంతవరకు దివ్యతో ఆ విషయం గురించి మాట్లాడలేదు మాట్లాడి చెప్తాను అని అంటుంది తులసి.