
బాపు-రమణ
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కూడా కనీవినిఎరుగని స్నేహం బాపు రమణలది. ఒకరు బొమ్మలు గీస్తే.. మరొకరు వారి రాతలతో ఆ బొమ్మలకు ప్రాణం పోసేవారు. సినిమాల్లో వీరిది అద్భుత శకం. ఒకరితరువాత ఒకరు ప్రాణాలు విడిచినా.. ఉన్నంత వరకూ ప్రాణంగా బ్రతికారు.. ఏ అలమరికలు లేకుండా స్నేహానికి నిర్వచనంలా మెలిగారు బాపురమణ. ఇప్పటి తరం వారికి ఆదర్శంగా నిలిచారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సాక్షి, ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, బుద్ధిమంతుడు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు లాంటి సినిమాలు ఎంత హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. వీరిలో ముందుగా రమణ కన్నుమూయగా.. కొన్నేళ్లకు బాపు తనువు చాలించారు.
మోహన్ బాబు-రజనీకాంత్
సినిమా కలిపిన స్నేహబంధాలలో చాలా బలమైన బంధం సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ బాబులది. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్ధాలకు ముందు నుంచి మంచి స్నేహితులు. సినిమాలకోసం చెన్నై లో ప్రయత్నాలు చేసేరోజుల్లో ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారట. సినిమా కష్టాలను ఇద్దరు కలిసి అనుభవించారు. ఇప్పుడు స్టార్లుగా మారినా కూడా వీరి స్నేహం ఇలానే కొనసాగుతోంది. రజనీకాంత్ చెన్నైలో.. మోహన్ బాబు హైదరాబాద్ లో ఉన్నా.. నిత్యం టచ్ లోనే ఉంటారు. వీరి స్నేహం ఇప్పటికీ అద్భుతంగా కొనసాగుతోంది.
త్రివిక్రమ్-పవన్ కల్యాణ్
సినిమా ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు.. అలా కలిపిన వారిలో బలమైన స్నేహ బంధం ఏర్పరుచుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. అందులో.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కల్యాణ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ చాలా కొద్దిమందితో మాత్రమే స్నేహం చేస్తారు. సన్నిహితంగా మెలుగుతారు. వారిలో త్రివిక్రమ్ తోనే ఆయన అనుబంధం ఎక్కువ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, భీమ్లానాయక్ వంటి సినిమాలు తీశారు. పవన్ నటించే కొన్ని సినిమాల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా రాశారు. ఆయన విజ్ఞాన గని అని త్రివిక్రమ్ ను అంటుంటారు పవన్ కళ్యాణ్.
త్రివిక్రమ్ - సునిల్
పవర్ స్టార్ కంటే ముందు నుంచే త్రివిక్రమ్ , సునిల్ మంచి స్నేహితులు. సినిమా అవకాశాల కోసం ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ.. సినిమా కష్టాలు అనుభవించారు. తిండి సరిగ్గా లేకపోయినా.. సర్ధుకుని.. ఒకరికి ఒకరు ప్రాణ స్నేహితుల్లా మెలిగేవారట. చాలాసినిమా ఫంక్షన్స్ లో.. ఒకరి గురించి మరొకరు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి.
ప్రభాస్-గోపీ చంద్
ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా కలిపిన స్నేహితుల్లో ప్రభాస్, గోపీచంద్‌లు కూడా ఉన్నారు. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వర్షం సినిమాలో ప్రభాస్ హీరో అయితే .. గోపీచంద్ విలన్ గా నటించాడు.. అప్పటి నుంచి వీరి స్నేహం మొదయ్యింది.. ఆరువాత చిన్నగా బలపడింది. ఇద్దరిలో ఎవరి సినిమా వేడుక జరిగినా తప్పకుండా హాజరవుతారు. ఇంట్లో ఏ పార్టీ ఉన్నా.. ఫంక్షన్ ఉన్న హాజరవుతారు.. అంతే కాదు.. అన్ స్టాపబుల్ లాంటి షోలో కూడా వీరి స్నేహం పరిమళించింది...
రామ్ చరణ్- రానా- శర్వానంద్
ఈముగ్గురిది సినిమా స్నేహం కాదు.. బాల్య స్నేహం. రామ్ చరణ్, రానా, శర్వానంద్ ముగ్గురు చెన్నైలో ఒకేస్కూల్ లో చదివారు. అప్పటి నుంచే వీరి స్నేహం బంలంగా ఉంది. సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా అది కంటిన్యూ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్, శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వీరిద్దరు కలిసి అయ్యప్ప మాలధారణ కూడా చేస్తుంటారు.
జూనియర్ ఎన్టీఆర్-రాజీవ్ కనకాల- రాజమౌళి
జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహం ఇప్పటిది కాదు. స్టూడెంట్ నంబర్ 1 సెట్స్‌లో మొదలైంది. ఎవరి జీవితంలో వారు బిజీ అయినప్పటికీ ఇప్పటికీ వారి స్నేహబంధం కొనసాగుతోంది. అంతే కాదు ఈసినిమాతో రాజమౌళి, ఎన్టీఆర్ కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. రాజమౌళి చేసిన సినిమాల్లో ఎన్టీఆర్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఇద్దరు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోనే సూపర్ హిట్ సాధించారు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కు వచ్చారు.
నారా రోహిత్-శ్రీవిష్ణు
ఫిల్మ్ ఇండస్ట్రీలో నారా రోహిత్ శ్రీవిష్ణు కూడా మంచి స్నేహితులు. వీరిద్దరి కెరీర్ బిగినింగ్ నుంచి స్నేహం ఇలానే కొనసాగుతోంది. ఇండస్ట్రీలో రోహిత్ అత్యంత ఇష్టపడే వ్యక్తి హీరో విష్ణు. విష్ణు కెరీర్ నిలబెట్టడానికి తన సినిమాల్లో అవకాశాలు ఇప్పించాడు.. విష్ణును హీరోగా పెట్టి అప్పట్లో ఒకడుండేవాడు సినిమా కూడా నిర్మించాడు నారా రోహిత్. శ్రీవిష్ణు కూడా రోహిత్‌కు కథల ఎంపికలో సాయం చేశాడు. వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
రామ్- జెనీలియా
జెనీలియా, రామ్ 2008 లో రెడీ సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడు మొదలైన వారి స్నేహం దశాబ్దకాలం దాటినా ఇంకా కొనసాగుతోంది. వీరిద్దరు తరచుగా కలుస్తుంటారు. పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా రీల్స్, వీడియోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. జెనీలియా రామ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఎప్పుడూ చెపుతుంటుంది హీరోయిన్. రామ్ కూడా అప్పుడప్పుడు ముంబయ్ వెళ్ళి.. జెనిలియా ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తుంటాడు.
మంచు లక్ష్మి - రకుల్ ప్రీత్ సింగ్
మంచు లక్ష్మి ,రకుల్ ప్రీత్ సింగ్ మంచి స్నేహితులు. వీరిద్దరు ఇంట్లో ఏవైనా పార్టీలు, ఫంక్షన్లు ఉన్నా.. లేదా బయట పబ్ లలో కలవాలి అనుకున్నా వెంటనే కలిసేస్తుంటారు. అంతే కాదు వీరు కలిసినప్పుడల్లా.. ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి కూడా ..మంచు లక్ష్మి చేసే ఏ షోకైనా రకుల్‌ను గెస్ట్ గా పిలుస్తుంటుంది.
ఇక ఇండస్ట్రీలో వీరే కాదు అఖిల్-రామ్ చరణ్, నితిన్-అఖిల్, త్రిష-నయనతార, అటు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ సీను, అటు సునిత, అనితా చౌదరి, లాంటివారు ఎందరో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. కూడా మంచి స్నేహితులు. వీరు తరుచుగా కలిసి టైం స్పెండ్ చేస్తారట.