పవిత్ర లోకేష్ కి బిగ్ షాక్, ఇదేం ట్విస్టు.. అయ్యో పాసైనా ఫలితం లేదే..  

Published : Aug 06, 2023, 09:42 AM IST

నటి పవిత్ర లోకేష్ కొన్ని వారాల క్రితం పీ హెచ్ డి చేసేందుకు బళ్లారిలోని హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాసిన సంగతి తెలిసిందే.ఇటీవల పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించింది అని.. రిజల్ట్ పట్ల ఆమె సంతోషంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవిత్రకి ఊహించని షాక్ తగిలింది.

PREV
16
పవిత్ర లోకేష్ కి బిగ్ షాక్, ఇదేం ట్విస్టు.. అయ్యో పాసైనా ఫలితం లేదే..  

నటి పవిత్ర లోకేష్ కొన్ని వారాల క్రితం పీ హెచ్ డి చేసేందుకు బళ్లారిలోని హంపి కన్నడ యూనివర్సిటీలో ప్రవేశ పరీక్ష రాసిన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు, పార్ట్నర్ నరేష్.. పవిత్రని దగ్గరుండి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్ష రాయించారు. కొన్నివారాల క్రితం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. కన్నడ సాహిత్యంలో పీ హెచ్ డి చేసేందుకు పవిత్ర ఈ ఎగ్జామ్ రాసింది. 

26

ఇటీవల పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించింది అని.. రిజల్ట్ పట్ల ఆమె సంతోషంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పవిత్రకి ఊహించని షాక్ తగిలింది. పవిత్ర ఉత్తీర్ణత అయితే సాధించింది కానీ యూనివర్సిటీలో సీటు పొందేందుకు అవసరమైన ర్యాంక్ సాధించలేకపోయిందట. దీనితో అర్హత సాధించిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ లో పవిత్ర పేరు లేదు. 

36

దీనితో తన మాతృ భాష సాహిత్యంలో పీ హెచ్ డి చేయాలన్న కల ప్రస్తుతానికి నెరవేరనట్లే అని అంటున్నారు. పవిత్ర లోకేష్ రిజల్ట్ పై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు. పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత పొందింది కానీ సరైన ర్యాంక్ సాధించకపోవడంతో సీటు పొందలేదు అని అన్నారు. దీనితో పవిత్ర కాస్త నిరాశలో ఉందట. అయితే ఆమె పీ హెచ్ డి చేసేందుకు ఇంకోసారి అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. నటనలో మాత్రం నరేష్, పవిత్రకు మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. 

46

తమ లేటు వయసు ప్రేమతో నరేష్, పవిత్ర ఇద్దరూ వార్తల్లో వివాదాల్లో నిలిచారు.  వరెన్ని విమర్శలు చేసినా తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర ఇంకా బలపరుచుకుంటున్నారు. నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతితో విడిపోయి.. పవిత్రతో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం కలసి జీవిస్తూ ప్రేమలో మునిగితేలుతున్నారు. 
 

56

  తమ రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో, ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకుంటూ ఈ జంట మళ్ళి పెళ్లి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం, లేటు వయసులో వరుస పెళ్లిళ్ల కారణంగా ఈ జంటపై ట్రోలింగ్ జరిగింది.   

66

పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. పెళ్లిపై తమకు గౌరవం ఉందని.. కానీ ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది అని కామెంట్స్ చేసారు. చేసుకోవాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాం అని గతంలో నరేష్ అన్నారు. 

click me!

Recommended Stories