Rajinikanth: రజనీకాంత్ ఓ హీరోయిన్‌ని చూసి ఫిదా అయిపోయాడట. తన ముందుకు రాగానే ఆమె అందాన్ని చూసి డైలాగ్ మర్చిపోయాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. ఆయన త్వరలో `జైలర్ 2` మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. దీంతోపాటు కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఇలా ఈ ఏజ్‌లో కూడా హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్న ఏకైక ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కావడం విశేషం.
25
హీరోయిన్‌ని చూసి డైలాగ్ మర్చిపోయిన రజనీకాంత్
ఇదిలా ఉంటే యాభై ఏళ్లు దాటయంటే అబ్బాయిల్లో అమ్మాయిలపై అంతగా ఆకర్షణ ఉండదు. తగ్గిపోతుంది. కానీ రజనీకాంత్ ఆరవై ఏళ్లలోనూ అమ్మాయికి ఫిదా అయ్యారట. ఓ హీరోయిన్‌ని చూసి మైండ్ బ్లాక్ అయిపోయిందట. డైలాగ్ మార్చిపోయాడట. ఆమె అందాన్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదట. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించడం విశేషం.
35
ఐశ్వర్య హీరోయిన్ అని చెప్పగానే ఆనందంతో గంతులు
రజనీకాంత్ 15ఏళ్ల క్రితం `రోబో` చిత్రంలో నటించారు. శంకర్ దీనికి దర్శకుడు. ఇందులో ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె హీరోయిన్ అని చెప్పినప్పుడే షాక్ అయ్యారట. లోలోపల సంతోషంతో ఎగిరి గంతేశాడట. ఈ విషయాన్ని `రోబో` ఈవెంట్‌లోనే రజనీకాంత్ చెప్పారు. మరో సందర్భంలో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు రజనీకాంత్.
ఐశ్వర్యా రాయ్‌ని దగ్గరగా చూసి డైలాగ్ మర్చిపోయిన రజనీ
ఐశ్వర్య రాయ్ తన దగ్గరకు వచ్చే సీన్ ఒకటి ఉందట. తన లవ్ ట్రాక్‌కి సంబంధించిన సీన్ అది. ఐశ్వర్యా రాయ్ తన దగ్గరకు వచ్చిందట. ఆమెని అంత దగ్గర నుంచి చూసే సరికి సూపర్ స్టార్‌కి మతిపోయింది. ఆమె అందాన్ని చూసి మైండ్ బ్లాక్ అయ్యిందట. దీంతో చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోయాడట. ఆ సమయంలోనే దర్శకుడిని పట్టుకుని `ఇది న్యాయం కాదు. ఆమె ఇంత అందంగా ఉన్నప్పుడు నేను మామూలుగా ఎలా నటించగలను` అని వెల్లడించారట. సరదాగా ఈ విషయాన్ని పంచుకున్నారు రజనీ. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
55
ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన రోబో
రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన `రోబో` మూవీ 2010లో విడుదలైంది. సంచలన విజయం సాధించింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. సౌత్‌లోనే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులో సైంటిస్ట్ గా, రోబోగా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. దుమ్మురేపారు. ఈ మూవీ చేసేటప్పుడు రజనీకాంత్ ఏజ్ 60ఏళ్లు. ఆ టైమ్‌లో కూడా ఆయన హీరోయిన్‌ని చూసి ఫిదా అయ్యాడంటే మామూలు విషయం కాదు, అది ఐశ్వర్య రాయ్ అందానికి సంబంధించిన గొప్పతనంగా చెప్పొచ్చు.