చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఇకపై కనకదుర్గ గుడే ఇళ్లన్నారు.. రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్స్

Published : Oct 16, 2023, 08:36 PM ISTUpdated : Oct 17, 2023, 01:46 PM IST

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా నటనతో, కామెడీతో అలరిస్తున్నారు నటకిరీటి రాజేంద్రపసాద్. కానీ తాజాగా తన జీవితంలోని విషాదం చెప్పి కన్నీళ్లు పెట్టించారు.  

PREV
15
చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఇకపై కనకదుర్గ గుడే ఇళ్లన్నారు.. రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్స్

నటకీరిటీ రాజేంద్రప్రసాద్‌ హీరోగా కమెడియన్‌గా అనేక చిత్రాలు చేశారు. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సినిమా ఏదైనా ఆయన అందులో ఉండాల్సిందే. అంతగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్‌.. `సుమ అడ్డా`లో సందడి చేశారు. సీనియర్‌ నటి గౌతమి, రాజు మదిరాజు, రచ్చ రవి కలిసి వచ్చారు. ఇందులో సుమతో కలిసి రచ్చ రచ్చ చేశారు. 

25

తాజాగా `సుమ అడ్డా` ప్రోమో విడుదలైంది. వైరల్‌ అవుతుంది. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఈ ప్రోమో సాగింది. కానీ చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ చెప్పిన విషయాలు ఆద్యంతం భావోద్వేగ భరితంగా ఉన్నాయి. తన చిన్నప్పుడు పెరిగిన పరిస్థితులను ఆయన బయటపెట్టారు. ఎప్పుడూ నవ్వించే ఆయన కంటతడి పెట్టించారు. 
 

35

చిన్నప్పుడు దసరా పండగని ఎలా సెలబ్రేట్‌ చేసుకునే వాళ్లో తమ అనుభవాలను పంచుకోవాలని యాంకర్‌ సుమ.. రాజేంద్రప్రసాద్‌ని అడిగింది. దీంతో ఆయన సీక్రెట్‌ బయటపెట్టారు. చిన్నప్పుడే తన అమ్మ చనిపోయిందని చెప్పారు. తాను మూడు నెలలు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్‌కి వెళ్లానని గుండెని బరువెక్కించాడు. 

45

అనంతరం మరో షాకింగ్‌ విషయం చెప్పారు.. తాను చనిపోయే స్థితికి చేరుకున్నప్పుడు కనక దుర్గ గుడికి తీసుకెళ్లి.. ఒరేయ్‌.. ఇక ఇంటి దగ్గర అమ్మ ఉండదుగా, ఇక్కడే మీ అమ్మ ఉంటుంది అని చెప్పారట. హృదయాన్ని కలచివేసే విషయాన్ని ఆయన వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా షో మొత్తం సైలెంట్‌ అయిపోయింది. కనకదుర్గమ్మనే అమ్మగా భావించిన పెరిగినట్టుగా రాజేంద్రప్రసాద్‌ చెప్పినట్టు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. 

55

ఇక రాజేంద్రప్రసాద్‌ నాటకాలు ఆడుతూ పెరిగాడు. ఈ క్రమంలో 1977లో `స్నేహం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గా, ఇలా భిన్న రోల్స్ చేశారు. ఏడాదికి పదికిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు ఇతర హీరోలతో కలిసి మల్టీస్టారర్స్, కీ రోల్స్ చేసి మెప్పించారు. నటకిరీటీగా పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం గాయత్రితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories