వైట్‌ శారీ ధరించి నీళ్లలో మునుగుతూ నిహారిక పుణ్యస్నానం.. దివ్య జ్ఞానం కోసం మెగాడాటర్‌ బ్రహ్మచారిణి పూజలు

Published : Oct 16, 2023, 07:21 PM IST

మెగా డాటర్‌ నిహారికలో విడాకుల తర్వాత చాలా మార్పు కనిపిస్తుంది. ఆమె చాలా బోల్డ్ గా మారింది. అదే సమయంలో డివోషనల్‌ వైపు  ఓపెన్‌ అవుతుంది. నిత్యం నెట్టింట ఏదో రూపంలో రచ్చ చేస్తుంది.   

PREV
17
వైట్‌ శారీ ధరించి నీళ్లలో మునుగుతూ నిహారిక పుణ్యస్నానం.. దివ్య జ్ఞానం కోసం మెగాడాటర్‌ బ్రహ్మచారిణి పూజలు

నిహారిక.. విడాకులు తీసుకున్నాక స్వేచ్ఛగా విహరిస్తుంది. గూట్లో నుంచి బయటపడ్డ పక్షిలా విహరిస్తుంది. స్వేచ్ఛా గాలులు పీల్చుతుంది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఆథ్యాత్మిక సేవలో మునిగిపోతుంది. మరోవైపు హాట్‌గానూ మారుతుంది. గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసి షాకిస్తుంది. 
 

27

ఆ మధ్య ఫ్యామిలీతో వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది. అంతకు ముందు ఒంటరిగానే విదేశాలు చుట్టేసి వచ్చింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలో తరిస్తుంది. జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆమె డివోషనల్‌ యాత్ర చేపట్టింది. 
 

37

తాజాగా మెగా డాటర్‌ నిహారిక.. దివ్య జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తుంది. అందుకు బ్రహ్మచారిణి దేవత పూజలో బిజీగా ఉంది. తెల్ల చీర కట్టుకుని నీట కొలనులో మునుగుతుంది. పుణ్యస్నానం ఆచరిస్తూ పూజలు నిర్వహించింది. అంతకు ముందు సాదువులా మారి షాకిచ్చింది. 
 

47

నిహారిక ఇలా ఉన్నట్టుండి ఇలా యాత్రలు చేపట్టడం ఆశ్యర్యపరుస్తుంది. తన కెరీర్‌ కోసం, తన పర్సనల్‌ లైఫ్‌ కోసం ఆమె ఇలా పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో నిహారిక చెబుతూ, జ్ఞాన స్వరూపిని బ్రహ్మచారిణి దేవిని సెలబ్రేట్‌ చేసుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

57

ఇక అంతకు ముందు కాషాయ రంగు దుస్తులు ధరించి సాధువులా మారిపోయింది. బ్లౌజ్‌ లేకుండా ఆమె కేవలం శారీ కట్టుకుని ఉదయాన్నే సూర్యరశ్మీని ఆస్వాదిస్తూ ఆకట్టుకుంటుంది. సహజమైన అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. 
 

67

నిహారికా.. ఈ మధ్యనే తన భర్త చైతన్య జొన్నలగడ్డకి విడాకులిచ్చింది. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే ఈ ఇద్దరి విడిపోవడం మెగా అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. మెగా ఫ్యామిలీ సైతం డిస్టర్బ్ అవుతుంది. అంతలోనే ఇప్పుడు వరుణ్‌ తేజ్‌, లావణ్యత్రిపాఠి పెళ్లి వేడుకతో మరోసారి సందడి నెలకొంది. నవంబర్‌లో ఈ ఇద్దరి పెళ్లి జరగబోతుంది. 
 

77

ఇక నిహారిక ప్రస్తుతం తన ప్రొడక్షన్‌పై వెబ్‌సిరీస్‌లు నిర్మించే పనిలో పడింది. అలాగే యాక్టింగ్‌ పై కూడా ఫోకస్‌ పెడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కొన్నాళ్లపాటు తనకు నచ్చినట్టుగా లైఫ్‌ని లీడ్‌ చేసే ఆలోచనలో నిహారిక ఉందని సమాచారం. అదే సమయంలో అందాల విందులోనూ హద్దులు చెరిపేస్తూ షాకిస్తుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుందీ మెగా డాటర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories