ప్రస్తుతం రాజమౌళి పూర్తి ఫోకస్ అంతా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'వారణాసి' సినిమాపైనే ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.
రాజమౌళి ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ.. మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ఇంకా కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చెప్పారు. ఇండియన్ మైథాలజీ, అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలయికతో ఈ సినిమా రాబోతోందని చెప్పారు.
'వారణాసి' సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పనులు పూర్తయ్యాకే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై ఆయన ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. హాలీవుడ్‌లో సినిమా చేయాలనే కలను రాజమౌళి వదులుకోలేదు. కానీ, ప్రస్తుతానికి ఆయన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం 'వారణాసి' సినిమానే. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.