రాజమౌళి విజన్ ని మ్యాచ్ చేయగలిగే దర్శకుడు ఉన్నాడా ? ఈ ప్రశ్నకు రాజమౌళి ఆ నిర్మాత ముఖం మీదే సమాధానం చెప్పారు. ఇంతకీ జక్కన్న ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం మొత్తం విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆల్రెడీ తెలుగు సినిమా, రాజమౌళి సత్తా ప్రపంచానికి పరిచయం అయింది. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసితో హాలీవుడ్ లో సైతం పాగా వేయాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ చిత్రం 1300 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది.
25
కాఫీ విత్ కరణ్
రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. అది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా చేసిన కాఫీ విత్ కరణ్ షో. ఈ షోలో జక్కన్న చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. కరణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బాలీవుడ్ కి సౌత్ కి ఉన్న తేడా వివరించారు.
35
బాలీవుడ్ స్టార్స్ కి కన్ఫ్యూజన్
బాలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్లకు తాము ఎలాంటి సినిమాలు తీయాలి, అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారు అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. కానీ సౌత్ సూపర్ స్టార్లు తాము చేయాలనుకుంటున్న సినిమా, అభిమానులు కోరుకుంటున్న సినిమాల విషయంలో మంచి క్లారిటీతో ఉంటారు. రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేస్తారు అని రాజమౌళి తెలిపారు.
ఇక బాలీవుడ్ దర్శకులలో మీ విజన్ ని మ్యాచ్ చేయగలిగే దర్శకులు ఎవరు ? అని కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి రాజమౌళి సమాధానం ఇస్తూ ఎవ్వరూ లేరు అని ముఖం మీదే చెప్పేశారు. కానీ గ్రాండ్ స్కేల్ లో సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు.సౌత్ నుంచి శంకర్ సార్, బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా భన్సాలీ గారు గ్రాండ్ స్కేల్ లో సినిమాలు చేస్తారు. వీళ్ళిద్దరిలో శంకర్ ది బెస్ట్ అని రాజమౌళి తెలిపారు.
55
టైం ట్రావెల్ కథతో వారణాసి
రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మూవీ టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, మైథలాజి అంశాలతో ఉండబోతోంది. ఈ మూవీలో రామాయణంలోని కీలక ఘట్టం ఉండబోతున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ఆ కీలక ఘట్టం మరేదో కాదు .. రాముడు, కుంభ కర్ణుడు మధ్య యుద్ధం అంటూ వార్తలు వస్తున్నాయి.