రజినీకాంత్ కు రాజమౌళి ఛాలెంజ్, 25 ఏళ్ల తలైవా రికార్డ్ ను బ్రేక్ చేసిన జక్కన్న.. ఎలానో తెలుసా..?

First Published | Dec 31, 2024, 11:13 AM IST

సూపర్ స్టార్ రజినీకీంత్ కు ఛాలెంజ్ చేశాడట స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. అనుకున్నట్టే ఛాలెంజ్ విన్ అయ్యాడు కూడా ఇంతకీ ఆయన చేసిన ఛాలెంజ్ ఏంటి..? గెపులు ఎలా వచ్చింది. 

Rajamouli

ఇంట గెలిచి రచ్చ గెలవాలిఅన్నారు పెద్దలు. మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి అదే పని చేశారు. ముందు టాలీవుడ్ లో తన సత్తా ఏంటో  చూపించాడు. ఓటమి ఎరుగని దర్శకుడిగా తన రికార్డ్ ను ఇంప్పటి వకూ ఎవరూ  చెరిపివేయలేకపోయారు. ఇక టాలీవుడ్ లో తానేంటో నిరూపించారు జక్కన్న.

ఆతరువాత రాజమౌళి  పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు. అది కూడా తను ఎదగడం మాత్రమే కాదు.. టాలీవుడ్ కు ఉనికి లేకుండా.. ఓ బ్రాండ్ లేకుండా చేసిన ఇతర ఇండస్ట్రీ వారికి మనమేంటో నిరూపించాడు. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్ లో ఉండేది. 
 

Baahubali

అప్పుడు తెలుగు సినిమాకు ఓ గుర్తింపు లేదు. తమిళ ఇండస్ట్రీ కిందనే మన తెలుగు సినిమాలు కూడా చూసేవారు. మన సినిమాల్ని కూడా అరవ సినిమాలు అనే అనేవారు. అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రీ వచ్చిన తరువాత  ఆ బ్రాండ్ పోయింది. ఇక మన సినిమాలను తక్కువ చేసి చూసిన వారికి సరైన సమాధానం చెపుతూ.. రాజమౌళి బాహుబలి రెండు సినిమాలతో తెలుగు వారి సత్తా ఏంటో చాటి చెప్పాడు. 


ఇక తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ వరకూ తీసుకెళ్ళాడు. ఆస్కార్ రేంజ్ కు ఎదిగేలా చేశాడు. ఈరకంగాఇప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు.. టాలీవుడ్ అనే రేంజ్ కు తీసకువచ్చాడు జక్కన్న.

ఈ క్రమంలో పాన్ ఇండియాలో కూడా గెలిచిన రాజమౌళి పాన్ వరల్డ్ పై ప్రస్తుతం కన్నేశాడు. అయితే జక్కన్న కు సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది అదేంటంటే.. బాహుబలి సినిమాతో 1900 కోట్ల కలెక్షన్లు సాధించిన... ఇండియన్ సినిమాకు సవాల్ విసిరిన దర్శకుడు.
 

Rajinikanths net worth Tamil film actors remuneration

ఈసినిమాతో జపాన్ లో మాత్రం రికార్డ్ కొట్టలేకపోయాడు. జపాన్ ప్రజలకు బాహుబలి అంటే ప్రాణం.. ప్రభాస్ ను ఆరాధిస్తుంటారు. కాని జపాన్ లో మొదటి నుంచి రజినీకాంత్ హవా ఎక్కువగా ఉండేది. ఆయన అంటే అక్కడి ఆడియన్స్ కు చాలా ఇష్టం. అంతే కాదు సూపర్ స్టార్ ముత్తు సినిమా అక్కడ రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ను ఎవరు అక్కడ బ్రేక్ చేయలేకపోయారు. బాహుబలికి కూడా అది సాధ్యం కాలేదు. 

దాంతో ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు రాజమౌళి. నెక్ట్స్ ఆర్ఆర్ఆర్ విషయంలో జాగ్రత్తగా అడుగులువేశాడు. హీరోలను కూడా రంగంలోకి దింపి.. జపాన్ లో కూడా ప్రమోష్లు చేశారు. దాంతో జపాన్ లో ఆర్ఆర్ఆర్ అదిరిపోయింది. 25 ఏళ్ల ముత్తు రికార్డ్ ను బ్రేక్ చేసేసింది ఆర్ఆర్ఆర్ సినిమా. తెలుగు సినిమా స్టార్స్ అంతే జపాన్ లో క్రేజ్ పెరిగిపోయింది. మనవారు అంటే అక్కడ స్టార్లుగా మారిపోయారు. 
 

ఇలా రజినీకాంత్ కు ఛాలెంజ్ చేసిన రాజమౌళి.. అనుకున్నట్టుగానే జపాన్ లో కూడా రికార్డ్ లు బ్రేక్ చేసి.. తెలుగు సినిమా పతాకం అక్కడ ఎగరేశాడు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు రాజమౌళి.

ఈమూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయిందట. ఇక జనవరిలో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. అమోజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈసినిమాకు దాదాపు 1200 కోట్ల బడ్జెట్ ను పెడుతున్నారని సమాచారం. 

Latest Videos

click me!