మహేష్‌ కోసం విదేశీ భామని దించుతున్న రాజమౌళి?.. సినిమా స్టార్ట్ కాకముందే మెంటల్‌ ఎక్కిస్తున్న జక్కన్న..

Published : Feb 11, 2024, 01:35 PM IST

మహేష్‌ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. ఇది ఈ సమ్మర్‌లో ప్రారంభం కానుందని తెలుస్తుంది. అయితే ఇందులో కాస్టింగ్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ షాకిస్తుంది.   

PREV
15
మహేష్‌ కోసం విదేశీ భామని దించుతున్న రాజమౌళి?.. సినిమా స్టార్ట్ కాకముందే మెంటల్‌ ఎక్కిస్తున్న జక్కన్న..

`ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి ఇండియన్‌ మూవీస్‌ రూపొందించిన దర్శకుడు రాజమౌళి.. నెక్ట్స్ గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. ఆయన ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ29గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ విషయంలో జక్కన్న ప్లానే, స్కెచ్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.  

25

ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథని సిద్ధం చేశాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్‌ కాస్ట్ అండ్‌ క్రూని దించుతున్నారట. అంతర్జాతీయ ఫిల్మ్ గా ప్రొజెక్ట్ కావాలంటే ఆ మాత్రం హంగామా ఉండాల్సిందే. అందుకే కాస్ట్‌, అండ్‌ క్రూ విషయంలో ఆయన తగ్గడం లేదు. 
 

35

ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్‌గా విదేశీ భామ పేరు తెరపైకి వచ్చింది. మహేష్‌ బాబుకి జోడీగా గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె పేరు చక్కర్లు కొట్టింది. కానీ విదేశీ హీరోయిన్‌ని తీసుకుంటున్నారట. ఇండోనేషియాకి చెందిన నటి ఎలిజబెత్‌ చెల్సియా ఇస్లాన్‌ని హీరోయిన్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలోనూ ఈ పేరు వినిపించింది. ఇప్పుడు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. 
 

45

ప్రస్తుతం రాజమౌళి కాస్టింగ్‌ని, అలాగే టెక్నిషియన్లని ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలో అన్వేషణ సాగుతుందని తెలుస్తుంది. మరోవైపు రాజమౌళి అంటే కొందరు టెక్నీషియన్లతోనే పనిచేస్తుంటారు. మ్యూజిక్‌, కెమెరా, వీఎఫ్‌ఎక్స్ విభాగాలను రిపీట్‌ చేస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం అందరిని మార్చబోతున్నట్టు సమాచారం. మరి తన బాబాయ్‌ కీరవాణిని రిపీట్‌ చేస్తాడా? మారుస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. 

55

మరోవైపు ప్రొడక్షన్‌ పరంగా కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. కేఎల్‌ నారాయణ నిర్మిస్తుండగా, ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మాణంలో భాగం కాబోతుందట. అలాగే అన్నపూర్ణ స్టూడియోపై నాగార్జున కూడా ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్ అవుతున్నట్టు సమాచారం. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించాలనుకుంటున్నారు రాజమౌళి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories