ప్రతి సెకన్ కి మారిపోవాలి అని డైరెక్టర్ కండిషన్.. అర్జున్ నటన చూసి రఘువరన్ ఏమన్నారంటే..

First Published | Aug 24, 2024, 4:46 PM IST

ఒకే ఒక్కడు చిత్రంలో అర్జున్, రఘువరన్ ల మధ్య జరిగే ఇంటర్వ్యూ సన్నివేశం చాలా ఫేమస్. ఈ సన్నివేశంలో అర్జున్ నటనను రఘువరన్ మెచ్చుకున్నారు. 

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ఒకే ఒక్కడు. అర్జున్, మనీషా కొయిరాలా, రఘువరన్, మణివణ్ణన్, వడివేలు  వంటి తారాగణం ఈ సినిమాలో నటించారు. 1999 దీపావళికి విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొంది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఈ సినిమాను ఇప్పుడు టీవీలో వేసినా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతగా ప్రేక్షకులను కట్టిపడేసింది ఒకే ఒక్కడు. ఈ సినిమాలోని డైలాగులు ఇప్పటికీ మీమ్స్ రూపంలో వైరల్ అవుతుంటాయి. ఒకే ఒక్కడు సినిమాలో టర్నింగ్ పాయింట్ అంటే అర్జున్ - రఘువరన్ ల ఇంటర్వ్యూ సన్నివేశమే.


ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో దర్శకుడు శంకర్.. అర్జున్ తో.. మీ ముఖ కవళికలు ప్రతి క్షణం మారుతూ ఉండాలి అని చెప్పారట. అర్జున్ కూడా అలాగే నటించారు. రఘువరన్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన కూడా ఈ సీన్ లో అదరగొట్టేశారు. ఇద్దరూ పోటీ పడి నటించి అదరగొట్టారట.

షూటింగ్ అయిపోగానే రఘువరన్.. అర్జున్ కు ఫోన్ చేసి మాట్లాడేవారట. "ఉదయం నుంచి మీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను.

మనం నటించిన ఇంటర్వ్యూ సన్నివేశంలో మీ ముఖ కవళికలు చాలా బాగున్నాయి" అని రఘువరన్.. అర్జున్ ను ప్రశంసించారట. తన తోటి నటుడి ప్రశంసలు అర్జున్ కు ఆనందాన్ని కలిగించాయట. 

Latest Videos

click me!