దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. కమర్షియల్ చిత్రాలతో ఆయన ఒక సంచలనం సృష్టించారు. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, శోభన్ బాబు, నాగార్జున, శ్రీకాంత్ లతో రాఘవేంద్ర రావు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఇది రాఘవేంద్రరావులో ఒక కోణం మాత్రమే.