యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా కొన్నేళ్లుగా టాలీవుడ్ లోనే కెరీర్ ను కొనసాగించింది. ‘మనం’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలతో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం తెలుగులో పదేళ్ల వరకు కొనసాగింది.
ఇప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వస్తోంది. అటు తమిళంలోనూ వచ్చిన అవకాశాలను ఆకట్టుకుంటోంది. చివరిగా ‘సర్దార్’ చిత్రంలో దక్షిణాది ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ వస్తోంది. ఆ మధ్యలో వచ్చిన ‘ఫర్జీ’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్బీఐ ఆఫీసర్ గా అలరించింది.
ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత రాశీ ఖన్నా సోషల్ మీడియాలో అదరగొడుతోంది. కాస్తా గ్లామర్ డోస్ పెంచి మతులు పోగొడుతోంది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మంటలు రేపుతోంది. స్కిన్ షోతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇప్పటికే రీసెంట్ గా బాలీవుడ్ లోని ఓ ఈవెంట్ కోసం హాజరైన రాశీ ఖన్నా కిర్రాక్ ఫొటోషూట్ తో కేక పెట్టించింది. ఇక తాజాగా మాత్రం పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది. తన బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంది.
తనంతట తానే నవ్వుకుంటూ సెల్ఫీలకు పోజులిచ్చింది. చుడీదార్ లో రాశీ ఖన్నా ముద్దుగా మెరియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇక రాశీ ‘అరణ్మనై 4’, ‘యోదా’, ‘ది శబర్మతి రిపోర్ట్’, ‘తెలుసు కదా’, ‘మేథావి’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.