‘పుష్ప’ కరోనా కలవరం: ఐసోలేషన్ లో బన్ని సైతం?, ఆ పొరపాటు చేయబట్టే
First Published | Dec 3, 2020, 9:01 AM ISTటాలీవుడ్ లో సినిమా షూటింగ్ లకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతిచ్చినా చాలా సినిమాలు మొన్న మొన్నటి దాకా ప్రారంభం కాలేదు. కరోనా కాస్త కంట్రోలుకు రావటంతో ఇప్పుడిప్పుడే ధైర్యం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ లు పట్టాలు ఎక్కుతున్నాయి. ఆచార్య,పుష్ప వంటి భారీ సినిమాల షూటింగ్ లు మొదలు కావటంతో మిగతావాళ్లు ధైర్యం చేయటానికి డెసిషన్స్ తీసుకుంటున్నారు. టీవీ సీరియళ్లు, చిన్న హీరోల సినిమాలు తక్కువ క్రూతో చేస్తున్నారు కాబట్టి వాటికి పెద్దగా సమస్యలు ఎదురుకావటం లేదు. అయితే ఇప్పుడు పుష్ప సినిమా టీమ్ లో కరోనా ప్రబలిందని, అందుకే షూట్ ఆగిందని వార్తలు మొదలయ్యాయి. ఎన్నో జాగ్రత్తలతో మొదలైన షూటింగ్ లో కరోనా పడగవిప్పటం ఏమిటి...అందుకు కారణం ఏమిటి...అసలేం జరిగింది అనే విషయాలు చూద్దాం.