Rashmika Mandanna: ఆల్ట్రా మోడ్రన్ గ్లామర్ డాల్ గా రష్మిక... సమ్మర్ వేర్లో సెగలు పుట్టిస్తున్న పుష్ప శ్రీవల్లి

Published : May 02, 2023, 02:04 PM ISTUpdated : May 02, 2023, 02:09 PM IST

హీరోయిన్ రష్మిక మందాన ఇమేజ్ బౌండరీలు బ్రేక్ చేసింది. ఈ నేషనల్ క్రష్ పాపులారిటీలో దూసుకుపోతుంది. అందుకే టాప్ బ్రాండ్స్ కి ప్రచారం కల్పిస్తున్నారు.   

PREV
16
Rashmika Mandanna: ఆల్ట్రా మోడ్రన్ గ్లామర్ డాల్ గా రష్మిక... సమ్మర్ వేర్లో సెగలు పుట్టిస్తున్న పుష్ప శ్రీవల్లి
Rashmika Mandanna

ఒనిట్సుకా టైగర్ స్ప్రింగ్-సమ్మర్ 2023 కలెక్షన్ కి రష్మిక మందాన ప్రచారం కల్పిస్తుంది. రష్మిక మందాన ఆల్ట్రా స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. రష్మిక న్యూ లుక్ కేక అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. 
 

26
Rashmika Mandanna


మరోవైపు రష్మిక ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఏకంగా మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ మూవీ 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుందని సమాచారం. స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 

36
Rashmika Mandanna

రష్మిక చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం యానిమల్.  రన్బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీపై హైప్ ఉంది. యానిమల్  పలు భాషల్లో విడుదల కానుంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది.

46
Rashmika Mandanna

ఇటీవల మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. వెంకీ  కుడుములతో రష్మికకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో సేమ్ కాంబోలో భీష్మ తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే  రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రకటించింది. 
 

56
Rashmika Mandanna

ఇదిలా ఉంటే రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకారు ఎప్పటి నుండో ఉంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె రొమాంటిక్ ట్రిప్స్ కి వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. అదే విషయం అడిగితే... ఫ్రెండ్ తో ట్రిప్ వెళితే తప్పేంటని రష్మిక ఎదురు ప్రశ్నించారు.

66


అలాగే  రష్మిక బర్త్ డేను విజయ్ దేవరకొండ దగ్గరుండి సెలబ్రేట్ చేశాడు. రష్మిక-విజయ్ దేవరకొండ ఒకే హోటల్ లో ఉన్నట్లు రుజువైంది. ఇంత సన్నిహితంగా ఉంటూ ప్రేమికులమని ప్రకటించడం లేదు. వీరి బంధం ఏమిటో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories