`పుష్ప 2` కేవలం నార్త్ లోనే సంచలన విజయం సాధించింది. అక్కడే ఇది 800కోట్ల నెట్ సాధించింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓవర్సీస్‌లోనూ ఫర్వాలేదనిపించింది. కానీ నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదంటున్నారు. మొత్తంగా `పుష్ప 2` నిర్మాతలను, బయ్యర్లని హ్యాపీ చేయలేకపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇటు కలెక్షన్ల పరంగా, అటు వివాదాలతోనూ మేకర్స్ కి డిజప్పాయింట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే.
read more: మెగా డాటర్ సుస్మిత పెళ్లి రేర్ సంగీత్ వీడియో.. చిరు, వెంకీ, బన్నీ, చరణ్, సాయితేజ్, శ్రీజ కిర్రాక్ డాన్స్
also read: `కల్కి 2`లో కల్కిగా కనిపించేది ఎవరు? క్రేజీ లీక్ ఇచ్చిన నాగ్ అశ్విన్.. పాండవులు, కమల్ హాసన్ పాత్ర గురించి