డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమా ఫినిష్ చేయగల సత్తా ఉన్న దర్శకుల్లో పూరి ఒకరు. కొంత కాలంగా పూరి జగన్నాధ్ ఫామ్ సరిగా లేదు. పూరి క్రేజ్ కి తగ్గట్లుగా హిట్ చిత్రాలు పడడం లేదు.