ధనుష్ నటించిన పుదుపేటై, విజయ్ నటించిన తెరి, బిగిల్, విజయ్ సేతుపతితో విక్రమ్ వేదా వంటి చిత్రాలలో సహాయ పాత్రలు పోషించిన జయసీలన్.
40 ఏళ్ల జయసీలన్ గత రెండు నెలలుగా కామెర్లతో బాధపడుతూ చెన్నై స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
వణ్ణారపేటలోని ఆయన ఇంట్లో అంత్యక్రియలు జరుగుతాయి. జయసీలన్ కి చాలా మంది హీరోలతో మంచి రిలేషన్ ఉంది. జయసీలన్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని నటుడు.
40 ఏళ్ల నటుడు జయసీలన్ మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Tirumala Dornala